మహేష్ ని ఫోన్ చేసి పిలిచి..ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక 2గంటలు ఆ పని చేసిన చిరంజీవి, మ్యాటర్ తెలిస్తే గూస్ బంప్స్

Published : Jul 18, 2024, 10:25 PM ISTUpdated : Jul 18, 2024, 10:26 PM IST

టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు, నటీనటులకు మెగాస్టార్ చిరంజీవి ఇన్సిపిరేషన్. తన తర్వాతి తరం హీరోల్లో చిరంజీవికి నచ్చే నటులు కొంతమంది ఉన్నారు. వారిలో ముందు వరుసలో సూపర్ మహేష్ బాబు ఉంటారు.

PREV
16
మహేష్ ని ఫోన్ చేసి పిలిచి..ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక 2గంటలు ఆ పని చేసిన చిరంజీవి, మ్యాటర్ తెలిస్తే గూస్ బంప్స్
Manchu Vishnu

టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు, నటీనటులకు మెగాస్టార్ చిరంజీవి ఇన్సిపిరేషన్. తన తర్వాతి తరం హీరోల్లో చిరంజీవికి నచ్చే నటులు కొంతమంది ఉన్నారు. వారిలో ముందు వరుసలో సూపర్ మహేష్ బాబు ఉంటారు. అప్పట్లో చిరంజీవి.. మహేష్ బాబు అతడు చిత్రం తనకి విపరీతంగా నచ్చింది అని చెప్పారు. 

26
Mahesh Babu

మహేష్ బాబు నటించిన మరో చిత్రం కూడా చిరంజీవికి విపరీతమైన ఇష్టం అట. ఆ మూవీ ఏదో సులభంగానే గెస్ చేయొచ్చు. మహేష్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి అంటే చిరంజీవికి చాలా ఇష్టం. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా చెప్పారు. 

36

పోకిరి రిలీజ్ తర్వాత రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్స్ నన్ను అభినందించారు. చిరంజీవి గారు అయితే.. ఒకరోజు పూరి జగన్నాధ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. నిన్ను కలవాలి రా అని పిలిచారు. నేను వెళితే ఆయన రెండు గంటల సేపు పోకిరి చిత్రం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. 

46

నా డైలాగులని నా ముందే నటించి చూపిస్తూ అభినందించారు అని మహేష్ తెలిపారు. చిరంజీవి గారు ఏ సినిమా గురించి మాట్లాడినా చాలా జెన్యూన్ గా మాట్లాడతారు. బాగాలేకున్నా అభినందించడం.. బాగున్నా తిట్టడం ఉండవు. పోకిరిలో ప్రతి విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకుని నాకు చెప్పారు అని మహేష్ బాబు తెలిపారు. 

56

సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. అక్కడ కూడా మహేష్ బాబు ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గారు పోకిరి చిత్రానికి తెలిపిన అభినందనలని జీవితాంతం గుర్తుంచుకుంటా అని మహేష్ అన్నారు. 

66

ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రానికి రెడీ అవుతున్నారు. మహేష్, రాజమౌళి కాంబినేషన్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. 

 

click me!

Recommended Stories