Guntur Kaaram : ‘గుంటూరు కారం’ పదిరోజుల కలెక్షన్స్.. మహేశ్ బాబు ఆల్ టైం రికార్డు!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరుకారం’ Guntur Kaaram కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతోంది. ఈ  చిత్రంతో మహేశ్ బాబు రీజినల్ ఫిల్మ్స్ లో సరికొత్త రికార్డను క్రియేట్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘గుంటూరుకారం’ Guntur Kaaram. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా Sreeleela, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. 

ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మూవీకి తొలిరోజు కాస్తా మిశ్రమ స్పందన లభించింది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. 


తొలిరోజే ఈ చిత్రం రూ.94 కోట్లు కలెక్ట్ చేసి అదరగొట్టింది. రెండోజుతో రూ.120 కోట్లకు పైగా వసూల్ చేసింది. అలా కలెక్షన్ల పరంగా ముందుకు వెళ్తూనే ఉంది. ప్రస్తుతం రూ.200 కోట్ల క్లబ్ లో చేరి కౌంటింగ్ స్టార్ చేసింది. 

ఇప్పటికీ ‘గుంటూరుకారం’ విడుదలై పది రోజులు అవుతోంది. ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ కలెక్షన్లు రాబడుతోంది. ఈ క్రమంలో ‘గుంటూరు కారం’ 10 డేస్ కలెక్షన్స్ వివరాలు అందాయి. 

వారం రోజుల్లోనే రూ.212 కోట్ల గ్రాస్ అందుకొని రీజినల్ ఫిల్మ్స్ లో మహేశ్ బాబు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. రీజినల్ మూవీస్ లో వారం రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం హాట్ టాపిక్ గ్గా మారింది.

ఇక  పది రోజుల కలెక్షన్ల వివరాలనూ మేకర్స్ తాజాగా ప్రకటించారు. రీజినల్ ఫిల్మ్ లో అత్యధిక వసూళ్ల చిత్రంగా రికార్డును కొనసాగిస్తూనే పదిరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.231 కోట్ల గ్రాస్ ను అందుకుందని తెలిపారు. ఇలా రమణగాడి జోష్ కనిపిస్తూనే ఉంది.  

Latest Videos

click me!