Sarkaru Vaari Paata First review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ... రికార్డు రేటింగ్... 5 పాయింట్స్ కి?

Published : May 11, 2022, 03:03 PM IST

సర్కారు వారి పాట విడుదలకు కొన్ని గంటల ముందే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ చిత్ర ఫస్ట్ రివ్యూ చెప్పేశారు. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ టాప్ రేటింగ్ దక్కించుకోగా ఫ్యాన్స్ కి థియేటర్స్ లో పూనకాలే అంటున్నారు.  

PREV
18
Sarkaru Vaari Paata First review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ... రికార్డు రేటింగ్... 5 పాయింట్స్ కి?
Sarkaru Vaari Paata Review

 
కరోనాతో పాటు కొన్ని అనుకోని కారణాల వలన మహేష్ (Mahesh Babu)కి రెండేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది. ఆయన గత చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదలైంది. సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. 
 

28
Sarkaru Vaari Paata Review

గీత గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరుశురామ్ ఏకంగా మహేష్ ని ఇంప్రెస్ చేశాడు. తన స్టోరీ లైన్ తో ప్రాజెక్ట్ ఓకే చేశారు. పరుశురాం తో మూవీ అనగానే ఫ్యాన్స్ ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో స్టార్స్ తో మూవీ చేసిన అనుభవం లేని ఈ డైరెక్టర్ మహేష్ ని డీల్ చేయగలడా? లేదా? అనే అనుమానం వ్యక్తం చేశారు. 
 

38
Sarkaru Vaari Paata Review


అయితే సర్కారు వారి పాట ట్రైలర్ (Sarkaru Vaari Paata Trailer)విడుదల తర్వాత అందరి థింకింగ్ మారిపోయింది. ట్రైలర్ తో ఫ్యాన్స్ కి ఫుల్ కాంఫిడెన్స్ ఇచ్చారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ లో మహేష్ విశ్వరూపం చూపించాడు. రొమాన్స్, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ కలగలిపి ట్రైలర్ కట్ చేసిన తీరు ఆకట్టుకుంది. థియేటర్స్ లో ఓ సరికొత్త మహేష్ ని చూడబోతున్నామన్న భావన కలిగించింది. 
 

48
Sarkaru Vaari Paata Review


కాగా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata First review) మూవీ విడుదలకు ముందే రివ్యూ వచ్చేసింది. ఓవర్ సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు మహేష్ మూవీపై తన అభిప్రాయం వెల్లడించారు. సర్కారు వారి పాట చిత్రానికి తన రేటింగ్ ఇచ్చాడు. ఉమర్ సంధు రేటింగ్, రివ్యూ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసేదిగా ఉంది. 
 

58
Sarkaru Vaari Paata Review


ఇక ఉమర్ సంధు తన ట్వీట్ లో.... సర్కారు వారి పాట మాస్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే చిత్రం. యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, కామెడీ సమపాళ్లలో కలగలిపి తెరకెక్కించిన చిత్రం. ఇక వెండితెరపై మహేష్ పెర్ఫార్మన్స్ అద్భుతం. మహేష్ ఫ్యాన్స్ సర్కారు వారి పాట చిత్రంతో ఓ గొప్ప అనుభూతిని పొందబోతున్నారు. సర్కారు వారి పాట చిత్రానికి నా రేటింగ్... 4.5/5 అని పొందు పరిచారు. 

68
Sarkaru Vaari Paata Review

సో... మాస్ క్లాస్ ఆడియన్స్ కి కావలసిన అన్ని అంశాలతో తెరకెక్కిన ఫుల్ మీల్ లాంటి సినిమాగా ఉమర్ సంధు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి ఈ చిత్రం గొప్ప ట్రీట్ అన్నారు. ఏకంగా ఐదుకు నాలుగున్నర పాయింట్స్ రేటింగ్ అంటే మామూలు విషయం కాదు. ఉమర్ సంధు రేటింగ్ ని బట్టి మహేష్ మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 
 

78
Sarkaru Vaari Paata Review


ఇక సినిమాపై ఉన్న బజ్ రీత్యా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్ సిటీలోనే ఇప్పటి వరకు రూ. 7 కోట్లకు పైగా ఓపెంగ్స్ నమోదయ్యాయి. రేపటికి ఈ ఫిగర్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం కలదు. సర్కారు వారి పాటతో (Sarkaru Vaari Paata opening collections) మహేష్ రికార్డు ఓపెనింగ్ ఫిగర్ సాధిస్తాడని ట్రేడ్ పండితుల అంచనా. 
 

88
Sarkaru Vaari Paata Review

ఇక కీర్తి సురేష్ (Keerthy Suresh)మహేష్ కి జంటగా నటిస్తున్న ఈ మూవీలో సముద్ర ఖని, నదియా, అజయ్, సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ కీలక రోల్స్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా... మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సర్కారు వారి పాట మే 12న రెండు వేలకు పైగా థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 
 

click me!

Recommended Stories