SVP Collections: పోటెత్తుతున్న ఫ్యామిలీ ఆడియన్స్.. మూడో రోజు వసూళ్ల వరద!

Published : May 15, 2022, 11:09 AM IST

సర్కారు వారి పాట సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. గురువారం విడుదలైన మహేష్ (Mahesh Babu)మూవీ లాంగ్ వీకెండ్ దక్కించుకోగా.. రెండవ రోజుకు మించిన కలెక్షన్స్ మూడో రోజు రాబట్టింది.   

PREV
16
SVP Collections: పోటెత్తుతున్న ఫ్యామిలీ ఆడియన్స్.. మూడో రోజు వసూళ్ల వరద!

మహేష్ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)తెలుగు రాష్ట్రాల్లో దూకుడు చూపిస్తుంది. పాక్షిక సెలవు దినం శనివారం ఈ చిత్ర కలెక్షన్స్ జంప్ అయ్యాయి. శుక్రవారంతో పోల్చితే శనివారం మెరుగైన వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఫస్ట్&సెకండ్ షోలకు ప్రేక్షకులు పోటెత్తారు.

26
Sarkaru vaari paata

ఫస్ట్ డే రికార్డు వసూళ్లు సాధించిన సర్కారు వారి పాట (SVP Collections)సెకండ్ డే వసూళ్ల పరంగా నెమ్మదించింది. హైదరాబాద్ సిటీ మినహాయిస్తే నైజాంలో భారీ డ్రాప్ కనిపించింది. శుక్రవారం వర్కింగ్ డే నేపథ్యంలో కలెక్షన్స్ తగ్గాయి. అయితే మూడో రోజు శనివారం సర్కారు వారి పాట కలెక్షన్స్ పుంజుకున్నాయి. 
 

36

ఫస్ట్ డే రూ. 36.63, సెకండ్ డే రూ. 11.64 కోట్ల తో కలిపి తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు రూ. 61. 11 కోట్ల షేర్ అందుకుంది. ఇక యూఎస్ లో లేటెస్ట్ సమాచారం మేరకు $1.8 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించింది. అక్కడ భీమ్లా నాయక్, పుష్ప లైఫ్ టైం వసూళ్లను సర్కారు వారి పాట దాటేసే అవకాశం కలదు.

46
Image: Still from 'Sarkaru Vaari Paata' trailer


ఇక ఆదివారం కూడా ఆన్లైన్ బుకింగ్స్ లో సర్కారు వారి పాట సత్తా చాటుతుంది. వీకెండ్ ముగిసే నాటికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కి దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సెకండ్ డే నుండి ఫ్యామిలీ ఆడియన్స్ సర్కారు వారి పాట చిత్రానికి క్యూ కడుతున్నారు. అది సినిమాకు ప్లస్ అయ్యింది. 

56
Sarkaru Vaari Paata collections

మరోవైపు సర్కారు వారి పాట టీమ్ సక్సెస్ టూర్ కి సిద్ధం అవుతున్నారు. మే 16న కర్నూల్ నగరంలో సాయంత్రం 6 గంటల నుండి విజయోత్సవ వేడుక జరగనుంది. సూపర్ స్టార్ మహేష్ తో పాటు దర్శక నిర్మాతలు ఈ వేడుకకు హాజరుకానున్నారు.  
  

66
Sarkaru Vaari Paata Review

3వ రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్... నైజాం - 5.83 కోట్లు
సీడెడ్ - 1.65 కోట్లు
UA ప్రాంతం - 1.95 కోట్లు
తూర్పు - 1.06 కోట్లు
వెస్ట్ - .45 కోట్లు
గుంటూరు -  .53 కోట్లు
కృష్ణ -  .92  కోట్లు
నెల్లూరు -  .45 కోట్లు

ఏపీ/తెలంగాణా- రూ.12.84 కోట్లు  

click me!

Recommended Stories