మహేష్ బాబు (Mahesh Babu) - నమ్రత శిరోద్కర్ కుమార్తె, సితార ఘట్టమనేని ఇప్పటికే స్టార్ కిడ్ గా అందరికీ సుపరిచితమే. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకుంటుంది. మరోవైపు క్యూట్ గా రీల్స్ చేస్తూ, డాన్స్ వీడియోలతోనూ అందరి అభినందలు పొందింది.
రీసెంట్ గా సితార అంతర్జాతీయ జ్యూవెల్లరీ బ్రాండ్ పీఎంజేకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రారంభమైన బ్రాంచ్ కార్యక్రమంలోనూ ఇంట్రెస్టింగ్ గా స్పీచ్ ఇచ్చి ఆకట్టుకుంటంది. తను చేసే ప్రతి పనితో తండ్రి తగ్గ తనయ అనిపించుకుంటోంది.
ఈరోజు సితార పుట్టిన రోజు కావడం విశేషం. జూలై 20, 2023న పుట్టిన ఈ స్టార్ కిడ్ తన 11వ పుట్టినరోజును అందరూ అభినందించేలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే ఆలోచనాత్మకంగానూ వేడుక జరుపుకుంటోంది. పుట్టినరోజున సితార మంచి మనుస్సును చాటుకుంది. తనవంతు సాయంగా నిరుపేదల బాలికలకు బహుమతులను అందజేసింది.
బర్త్ డేను విలాసవంతమైన వేడుకగా జరుపుకోకుండా, తన సొంతూరైన బుర్రిపాలెంలోని ప్రైమరీ స్కూల్ విద్యార్థినులతో గడిపింది. సితార ఫౌండేషన్ నుండి బాలికలకు గులాబీ రంగు సైకిళ్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. వారికి సైకిళ్లు అందనున్నాయని ఓ వీడియో ద్వారా తెలిపారు.
అయితే, ఇంత చిన్న వయస్సులో సితార ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుండటంతో అందరూ అభినందిస్తున్నారు. సితార వేస్తున్న ప్రతి అడుగు తల్లిదండ్రులుగా మహేశ్ బాబు, నమ్రత గర్వపడే క్షణమనే చెప్పాలి. ఇందుకు నెటిజన్లు కూడా సితారపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సితార తన ఫస్ట్ రెమ్యూనరేషన్ ను కూడా చారిటీకి అందించి గొప్ప మనస్సును చాటుకుంది. ఇక తను సినీ రంగంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు రీసెంట్ గా జరిగిన పీఎంజే మీడియా కార్యక్రమంలో తెలిపింది. ఇప్పటికే మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’లో ఓ సాంగ్ కు డాన్స్ ఇరదీసింది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.