Published : Jan 28, 2022, 05:38 PM ISTUpdated : Jan 28, 2022, 05:46 PM IST
ఎడ్యుకేషన్ ఒకప్పుడు సొసైటీలో స్టేటస్ సింబల్ గా ఉండేది. ఈ రోజుల్లో ఇంటికి ఇద్దరు ఇంజినీర్లు, వీధికొక్క డాక్టర్ ఉంటున్నారు కానీ... ఆ రోజుల్లో డిగ్రీ చదివినోడు ఊరి మొత్తం మీద ఒక్కడు కూడా ఉండేవాడు కాదు.
సామాన్యుడి కైనా సెలెబ్రిటీ కైనా చదువు చాలా ముఖ్యం. లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్స్ ఎంత చదువుకున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే కనీస సౌకర్యాలు లేని కాలపు హీరోలు డిగ్రీలు చదివితే మన తరం హీరోలలో కొందరు డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అలనాటి నుండి ఈనాటి వరకు టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరెవరు ఎంత వరకు చదువుకున్నారో చూద్దాం...
212
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సైన్స్ స్టూడెంట్. భీమవరంలోని డి ఎన్ ఆర్ స్కూల్ లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ప్రభాస్ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. పెదనాన్న కృష్ణంరాజు స్పూర్తితో హీరోగా మారాడు.
312
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్ లోని ఎమ్మెస్సార్ కాలేజ్ నుండి BBA చదివాడు. డిగ్రీ తర్వాత గంగోత్రి మూవీతో హీరోగా మారారు.
412
టీనేజ్ పూర్తి కాకుండానే హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ (Ntr)పెద్దగా చదువుకోలేదు. ఎన్టీఆర్ హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి, తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. అయితే తెలుగుతో పాటు ఇంగ్లీష్, కన్నడ భాషలు ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడుతారు.
512
టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) మద్రాస్ లోని లయోలా కాలేజ్ లో B.Com పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదివిన మహేష్ బాబుకు తెలుగు కనీసం చదవడం, రాయడం రాదు.
612
మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)నర్సాపురం డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. చిరంజీవి కామర్స్ స్టూడెంట్ కావడం విశేషం. డిగ్రీ కంప్లీట్ చేసిన చిరంజీవి నటుడు కావాలని భరతనాట్యం, నటనలో శిక్షణ తీసుకున్నారు. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి టాప్ స్టార్ అయ్యాడు.
712
నట సింహం బాలకృష్ణ (Balakrishna)ఎడ్యుకేషన్ హైదరాబాద్ లో సాగింది. బాలకృష్ణ నిజాం కాలేజీలో B.Com పూర్తి చేశారు. ఎన్టీఆర్ వారసుడిగా చదువుకునే రోజుల్లోనే బాలకృష్ణ ముఖానికి రంగేసుకున్నారు.
812
విక్టరీ వెంకటేష్ అమెరికాలో MBA పూర్తి చేశారు. లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు కొడుకు వెంకటేష్ ని విదేశాల్లో చదివించారు. బిజినెస్ మాన్ కావాలనుకున్న వెంకటేష్ అనూహ్యగా హీరో అయ్యారు.
912
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు పవన్ (Pawan Kalayan)విద్యాబ్యాసం నెల్లూరు, బాపట్ల ప్రాంతాల్లో సాగింది. సిల్వర్ స్క్రీన్ పై అల్లాడించే పవన్ చదువులో మాత్రం పూర్. అందుకే ఆయన ఎడ్యుకేషన్ ఇంటర్ తో ఆగిపోయింది.
1012
కింగ్ నాగార్జున(Nagarjuna) సైతం విదేశాల్లో ఉన్నత డిగ్రీలు పూర్తి చేశారు. నాగార్జున మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో పీజీ చేశారు. కనీసం ప్రాథమిక విద్య పూర్తి చేయలేకపోయిన నాగేశ్వరరావు నాగార్జున బాగా చదువుకోవాలని ఆశపడ్డారు.
1112
ఎన్టీఆర్(నందమూరి తారకరామారావు) అరుదైన, ఎప్పుడూ చూడని ఫోటోలు.
ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు డిగ్రీ వరకు చదువుకున్నారు. గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వదిలేసి హీరో కావాలనే కోరికతో చెన్నై ట్రైన్ ఎక్కారు.
1212
ఆన్ స్క్రీన్ దేవదాసు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయలేదు. ఆయన కేవలం మూడో క్లాస్ వరకు చదువుకున్నారట. హీరో అయ్యాక నాగేశ్వరరావు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం విశేషం.