సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుసగా హిట్లు అందుకుంటున్నారు. ఆయన లాస్ట్ నాలుగు చిత్రాలు ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘సర్కారు వారి పాట’ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే కొన్నాళ్లుగా మహేశ్ బాబు రెండు అంశాలను తప్పకుండా తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటున్నారు. ఒకటి సోషల్ ఎలిమెంట్, మరోకటి మాస్ సాంగ్ తప్పకుండా ఉంటున్నాయి. ప్రస్తుతం ‘గుంటూరు కారం’లో ఒక స్ట్రాటజీని అప్లై చేశారు.
త్రివిక్రమ్ Trivikram - మహేశ్ బాబు కాంబోలో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ నుంచి మాస్ సాంగ్ రాబోతోంది. ‘కుర్చీ మడతపెట్టి’ (kurchi madatha Petti) సాంగ్ ప్రోమో ఇప్పటికే సెన్సేషన్ గా మారింది. ఈ డైలాగ్ మొన్నటి వరకు నెట్టింట దుమ్ములేపింది.
ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మూవీలోనే పెట్టడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)తో కలిసి బాబు ఊరమాస్ స్టెప్పులేయడం మరింత కిక్కునిస్తోంది. ఫుల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తోంది.
అయితే, మహేశ్ బాబు గత చిత్రాల్లోనూ హీరోయిన్లతో మాస్ స్టెప్పులతో మడతపెట్టారు. ఆ మూవీ సాంగ్స్, హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. తొలుత ‘ఆగడు’ మూవీలో శృతిహాసన్ Shruti Haasan తో ‘జంక్షన్ లో’, తమన్నా Tamannaah Bhatiaతో ‘భేల్ పూరి’ వంటి సాంగ్స్ లో మాస్ స్టెప్పులేశారు.
తర్వాత బ్లాక్ బాస్టర్ మూవీ ‘శ్రీమంతుడు’ Srimanthuduలో మళ్లీ శృతిహాసన్ తో కలిసి ‘దిమ్మతిరిగే’ అనే సాంగ్ తో అలరించారు. ఇద్దరు స్టార్స్ తమ పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. ఈ సాంగ్స్ అప్పట్లో ఊపూపింది. ఇక ‘మహర్షి’లో పూజాహెగ్దే (Pooja Hegde)తో ‘పాల పిట్టా’ అనే సాంగ్ ఉండేలా చూసుకున్నారు. మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంలో రష్మిక మందన్న Rashmika Mandannaతో కలిసి ‘మైండ్ బ్లాక్’ అనే సాంగ్ తో దుమ్ములేపారు.
చివరిగా వచ్చిన ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్ కీర్తి సురేష్ Keerthy Sureshతో కలిసి ‘మామ మహేశా’ సాంగ్ కు మాస్ జాతర చేశారు. ఫ్యాన్స్ తో స్టెప్పులేయించారు. ఈ సాంగ్ మొన్నటి వరకు వినిపించింది. ఇలా ప్రతి సినిమాలో సామాజిక అంశంతో పాటు మాస్ సాంగ్ ను కూడా ఉండేలా చూసుకుంటున్నారు.
ఇప్పుడు Gunut Kaaramతో రాబోతున్నారు. ప్రస్తుతం ‘కుర్చీ మడతపెట్టి’ అనే మాస్ స్పైసీ సాంగ్ వస్తోంది. ఇక సినిమాలో ఎలాంటి సబ్జెక్ట్ ను చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024న విడుదల కాబోతోంది.