మహేష్ బాబు జోడీగా ఈసినిమాలో ప్రియాంకచోప్రా నటించబోతుందని, విలన్ గా మలయాళ స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారని సమాచారం. ఇక తాజాగా ఈసినిమాకు సబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఈసినిమాలో మహేష్ బాబు అన్నగా వెంకటేష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ గతంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.