ఎంత పెద్ద హీరో అయినా.. ఏ స్థాయికి వెళ్లినా.. వారికంటూ డ్రీమ్ రోల్స్ ఉంటాయి. కనీసం ఒక్కటైనా ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా అలాంటిదే డ్రీమ్ రోల్ ఒకటుందట. అది చేయడం సాహసమనే చెప్పాలి.. మరి మహేష్ ఆ ప్రయోగం చేయగలడా? నిజమెంత?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరు హీరోలకంటే స్పెషల్ అనిపించుకున్నది మహేష్ బాబు ఒక్కడే. అందం, నటన రెండింటినీ సమానంగా మెయింటేన్ చేస్తూ.. టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు సూపర్ స్టార్. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే సూపర్ స్టార్..షూటింగ్స్ ఉంటే సెట్ లో.. లేకపోతే ఇంట్లో ఫ్యామిలీకే తన టైమ్ ను కేటాయిస్తుంటారు.
పార్టీలు, ఫంక్షన్లు, ఇతర స్టార్స్ తో కలిసి టూర్లు లాంటివాటిలో మహేష్ అస్సలు ఇన్వాల్వ్ అవ్వడు. సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు మహేష్. ఇక నటన విషయానికి వస్తే.. తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు పాత్రల ఎంపికలో చూపించే వైవిధ్యం కారణంగా ఆయన అభిమానుల మధ్య మాత్రమే కాకుండా సినీ వర్గాల్లో కూడా మంచి గుర్తింపు పొందారు.
26
మహేష్ బాబు రూటే సెపరేటు..
కెరీర్ ప్రారంభ దశలోనే ప్రయోగాత్మక సినిమాలు చేసిన మహేష్.. ఆ టైమ్ లో బాగా ఎదురుదెబ్బలు తిన్నాడు. రాను రాను తనలో తాను మార్పులు చేసుకుని.. కథల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేసి.. సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగాడు. రావడం కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నాడు మహేష్. సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 20 సినిమాలు చేసిన రికార్డ్ ఉంటే..మహేష్ బాబు మాత్రం రెండేళ్లకు ఒక సినిమా చేసిన రికార్డు ఉంది.
36
మహేష్ బాబు డ్రీమ్ రోల్..
మహేష్ బాబు ఇప్పటివరకు ఎన్నో పాత్రలు చేసినప్పటికీ తనకు ఒక డ్రీమ్ రోల్ ఉందట. ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో చాలా రకాల పాత్రలు చేసినప్పటికీ.. మహేష్ చేయాలనుకుంటున్న ట్రీమ్ రోల్ కోసం సరైన కథ, దర్శకుడు దొరకలేదట. ఇంకీ సూపర్ స్టార్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా? మహేష్ బాబు చేయాలనుకుంటున్న ఆ డ్రీమ్ రోల్ ఏదో కాదు.. అల్లుూరి సీతారామరాజు. ఆయన తండ్రి చేసిన ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రను మహేష్.. మరోసారి తెరపై మళ్లీ సృష్టించాలని ఆయన ఆశపడుతున్నారట. కానీ ఈ విషయం అఫీషియల్ గా మాత్రం ఎక్కడా ఆయన చెప్పలేదు.
ఈ పాత్రతో సినిమా చేయడం అంత సులభమైన విషయం కాదు. గతంలో వచ్చిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా ప్రేక్షకుల్లో గాఢమైన ముద్ర వేసినందున, అదే పాత్రను మరోసారి చేయడం కత్తి మీద సాము లాంటి పని. పైగా ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కు , కృష్ణకు అభిప్రాయభేదాలు కూడా వచ్చాయి. ఎన్టీఆర్ కూడా కృష్ణ చేసిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసి.. ఇక నేను చేయడంలో అర్ధం లేదు అని వెనక్కి తగ్గారు. అలాంటి పాత్రను మహేష్ చేస్తే.. వర్కౌట్ అవుతుందా?
56
సీతారామరాజు గా మహేష్ ను ఆడియన్స్ ఆదరిస్తారా?
అసలు ఇప్పటి ప్రేక్షకులు అలాంటి పాత్రను ఎలా స్వీకరిస్తారు అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. కానీ సీతారామరాజు గెటప్ లో మాత్రం మహేష్ బాబు అద్భుతంగా ఉంటాడు.. ఇప్పటికే గతంలో కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్లు నెట్టింట సందడి చేశాయి. ఆ పాత్రలో మహేష్ చాలా బాగా ఉంటారు. తండ్రి చేసిన పాత్రను ఆయన రీ క్రేయేట్ చేస్తున్నాడు కాబట్టి.. అభిమానుల నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందని కొంతమంది అభిప్రాయం. అందువల్ల ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ నిజం కావాలంటే ప్రత్యేకంగా ఒక దర్శకుడు ముందుకు వచ్చి మహేష్ బాబుతో ఆ కథను తెరకెక్కించాల్సిందే.
66
రాజమౌళి సినిమాతో బిజీగా..
ఇప్పటికే సినిమాల ఎంపికలో మహేష్ బాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో సరికొత్త మహేష్ బాబును జనం చూడబోతున్నారు. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమా రూపొందుతున్నట్టు సమాచారం.