Mahesh Bollywood Entry: బాలీవుడ్ పై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు, ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్

Published : May 10, 2022, 11:07 AM ISTUpdated : May 10, 2022, 12:06 PM IST

సౌత్ నుంచి చాలా మంది స్టార్స్ బాలీవుడ్ లోకూడా సత్తా చాటుతున్నారు. ఇప్పటికే సౌత్   బాలీవుడ్ ను  షేక్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్ నుంచి అందరు స్టార్స్ పాన్ ఇండియా వైపు చూస్తుంటే..సూపర్ స్టార్ మహేష్ మనసులో ఏముంది..? ఆయన ఏమన్నారు...? 

PREV
16
Mahesh Bollywood Entry: బాలీవుడ్ పై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు, ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన  సూపర్ స్టార్

సౌత్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవుతుంది. పాన్ ఇండియా సినిమాలు సౌత్ స్టార్స్ బాలీవుడ్ ను ఆక్రమించారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ డైరెక్టర్లు బారులు తీరున్నారు. చాలా మంది సౌత్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం పాకులాడుతున్నారు. మరి సౌత్ సూపర్ స్టార్లలో ఒకడైన మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు..? 

26

సౌత్   స్టార్ హీరోలలో సూపర్ స్టార్ ఇమేజ్ సాధించిన హీరో మహేశ్ బాబు బాలీవుడ్ వైపు ఎందుకు వెళ్లలేదు..? ఇదే ప్రశ్న రీసెంట్ గా ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కామన్ ఆడియన్ ను కూడా పట్టి పీడిస్తుంది. అయితే సరైన సమయం కోసం అందరూ ఎదురు చూశారు. మహేష్ ఏం చెపుతాడా అని ఆసక్తిగా గమనించారు. ఇక రీసెంట్ గా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు మహేష్. 
 

36

తాజాగా మహేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన మేజర్ సినిమా  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. అందులో బాలీవుడ్ ఎంట్రీపై కూడా వివరణ ఇచ్చారు మహేష్. తనను బాలీవుడ్ పరిశ్రమ భరించలేదంటూ ఆయన ఇచ్చిన సమాధానం తో అందరూ షాక్ అయ్యారు. 
 

46

మహేష్ మాట్లాడుతూ... హిందీ పరిశ్రమ నుంచి నాకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. నన్ను వారు భరించగలరని అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పనిచేయడం వల్ల నా టైమ్ వేస్ట్ అవుతుంది. అందుకే నేను ఆ పనిచేయదలచుకోవడం లేదు అన్నారు సూపర్ స్టార్ . 
 

56

టాలీవుడ్ లో నాకు వచ్చిన గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ పట్ల నేను సంతోషంగా ఉన్నాను. అందుకే, నా పరిశ్రమను విడిచి పెట్టే ఆలోచన చేయను. సినిమాలు చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలనే ఎప్పుడూ అనుకుంటాను. నా కల ఇప్పుడు నెరవేరుతోంది అంటూ మహేశ్ బాబు వివరణ ఇచ్చారు. 

66

మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఈనెల 12న రిలీజ్ కాబోతోంది.  రెండేళ్ల  కరోనా గ్యాప్ తరువాత  మహేశ్ బాబు సినిమా రాబోతుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ కాబోతున్నారు మహేష్. ఆ తరువాత  రాజమౌళి సినిమా ప్రాజెక్టులో మహేశ్ పనిచేయనున్నారు.   

click me!

Recommended Stories