ఫ్యామిలీతో కలిసి ఈవెంట్ లో మహేశ్ బాబు సందడి.. సూపర్ స్టార్ లుక్ వైరల్, నమ్రతా ఇంట్రెస్టింగ్ కామెంట్

First Published | Jun 6, 2023, 2:15 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా ఫ్యామిలీతో కలిసి ఓ ఓ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫొటోసెషన్ లో మహేశ్ బాబు సందడి చేశారు. ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. నమత్రా కూడా పార్టీ పిక్స్ ను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాలు తప్పితే ఎక్కువగా ఫ్యామిలీతోనే సమయం గడుపుతుంటారు. ఉంటే హైదరాబాద్ లోని తమ ఇంట్లో లేదంట ఫారేన్ ట్రిపులకు వెళ్తుంటారు. అయితే తొలిసారిగా మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నారు. 

అయితే మహేశ్ బాబు కుటుంబానికి దగ్గరైన యంగ్ కపుల్ శ్రియా భూపాల్ - అనిందిత్ ఇంట్లో ఈవెంట్ నిర్వహించారు.  నిన్న రాత్రి వారి ఇంట్లో బేబీ షవర్ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు మహేశ్ బాబు కుటుంబంతో కలిసి హాజరయ్యారు. 
 


ఈ సందర్భంగా ఫొటో సెషన్ టైమ్ లో సందడి చేశారు. ఫన్నీగా ఫొటోలకు ఫోజులిస్తూ అందిరిలో జోష్ నింపారు. ప్రస్తుతం మహేశ్ బాబు లుక్స్ నెట్టింట వైరల్ గా మారింది. బ్లాక్ టీషర్ట్, బ్లాక్ జీన్స్ లో మహేశ్ బాబు లుక్ అదిరిపోయింది. దానికి తోడు బ్యూటీఫుల స్మైల్ తో ఫిదా చేశారు. 
 

నిన్న రాత్రి మహేశ్ బాబు కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడిపినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు నమ్రతా శిరోద్కర్ కూడా తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసుకుంది. పదకొండేళ్ల చిన్నారి సితారతో కలిసి పార్టీకి అటెండ్ కావడం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చింది. 
 

మహేశ్ బాబుతో, సితారతో, తమ స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంది. సితార తన తండ్రిలాగే చాలా సందడి చేసిందన్నారు. గత రోజులు గుర్తుకు వచ్చాయంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి ఓకే పార్టీలో ఇలా ఎంజాయ్ చేయడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

ఒకేసారి ఫొటో డంప్ చేయడంతో ఐఫీస్ట్ గా మారింది. ఫ్యాన్స్ ఆ ఫొటోలను లైక్స్ తో వైరల్ గా మారుస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్దే, శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది.
 

Latest Videos

click me!