Guppedantha manasu: రిషి బాధకు కారణమైన మహేంద్ర.. కాలేజ్ లో ఎదురుపడ్డ జగతి, రిషి!

Navya G   | Asianet News
Published : Mar 04, 2022, 11:31 AM IST

Guppedantha manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ (Guppedantha manasu) గుప్పెడంత మనసు కాలేజీలో ఇక ఈ సీరియల్లో ఈ రోజు ఎపిసోడ్లో  ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
15
Guppedantha manasu: రిషి బాధకు కారణమైన మహేంద్ర.. కాలేజ్ లో ఎదురుపడ్డ జగతి, రిషి!

గౌతమ్ రిషిని కార్లో ఇంటికి తీసుకెళ్తూ రిషి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నేను నీ ఫ్రెండ్ ని  నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను అంటూ ధైర్యం చెప్తాడు. దేవయాని జరిగిన విషయాన్ని గురించి  ఆలోచిస్తూ ఫణీంద్ర ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ ఫణీంద్ర ఈ విషయాన్ని పెద్దది చేయకు,ఎవరితోనూ దీని గురించి మాట్లాడొద్దు అంటాడు. ఇక మహేంద్ర ఇంటికి రావడంతో దేవయాని మహేంద్ర ను చూసి మొహం తిప్పుకొంటుంది.
 

25

రిషి కూడా అప్పుడే ఇంటికి వస్తాడు ఇక రిషి రావడం చూసిన దేవయాని ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటుంది. ఇక దాంతో రిషి కి సపోర్ట్ చేస్తున్నట్లు నటిస్తూ మహేంద్ర ను దోషిగా చూపించి మాట్లాడుతుంది. మహేంద్ర దేవయానికి ఎదురు తిరిగి జగతి నా భార్య అని చెప్పినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని ఎవరికీ దీని గురించి సమాధానం చెప్పనవసరం లేదు అంటాడు మహేంద్ర మాటలకు దేవయాని షాక్ అవుతుంది.
 

35

రిషి కూడా మహేంద్ర మాట్లాడిన  మాటలకు, జరిగిన విషయం గురించి చాలా బాధపడతాడు దేవయాని మాత్రం బాధపడుతున్న  రిషిని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. గౌతమ్ దేవయాని దగ్గరకు వచ్చి రిషి బాధపడుతున్నాడు ఇప్పుడు తనని ఏమీ మాట్లాడించకండి అంటాడు. గౌతమ్  జగతి మేడం చాలా మంచిది కదా, రిషి అమ్మ అని తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. కానీ దేవయాని జగతి మంచిది కాదు అంటూ గౌతమ్ ముందు కూడా జగతిని చెడుగా చూపించాలి అనుకుంటుంది. కానీ గౌతమ్ దేవయాని మాటలను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.
 

45

వసుధర అందరికీ కాల్ చేస్తూ ఉంటుంది కానీ ఎవరూ కూడా కాల్ ఆన్సర్ చేయరు. ఇక రిషి  జరిగిన విషయాలను తలుచుకుంటూ ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు. దేవయాని, మహేంద్ర రిషి ని చూస్తూ ఉంటారు జగతి కూడా తన కొడుకుని బాధ పెట్టినందుకు బాధపడుతూ ఉంటుంది. వసుధార ఎవరికి ఫోన్ చేసినా ఆన్సర్ చేయకపోవడంతో గౌతమ్ కు కాల్ చేస్తుంది గౌతమ్ కూడా జగతి, మహేంద్ర,రిషి ల గురించి గతంలో తాను మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలి అనుకుంటాడు.
 

55

వసుధార కాల్ ను ఆన్సర్ చేసి మాట్లాడతాడు వసుధార రిషి గురించి జాగ్రత్తలు చెప్తూ రిషి సార్ ని బాగా చూసుకోండి అని చెప్తుంది. వసుధారా రిషి కోసం కాలేజీలో ఎదురుచూస్తూ ఉంటుంది రిషి రావడంతో సంతోషిస్తుంది వసుధార. కానీ రిషి బాధపడుతూ మాట్లాడటంతో వసు కూడా చాలా బాధపడుతుంది. ఇక రిషి, జగతి కాలేజ్ లో ఒకరికొకరు ఎదురు పడతారు. మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిందే.

click me!

Recommended Stories