వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘శాంతి’ (1952) సినిమాతో ఫుల్ టైమ్ హీరోయిన్ అయిపోయింది సావిత్రి. ఇందులో రామచంద్ర కశ్యప సరసన నటించింది.
దోనేపూడి కృష్ణమూర్తి.. త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో నిర్మించిన ‘ప్రియురాలు’ (1952) చిత్రంలో రెండవ హీరోయిన్ సరోజగా చంద్రశేఖర్ సరసన నటించింది.
ఇక విజయా వారు నిర్మించిన ‘పెళ్ళి చేసి చూడు’ చిత్రం తరవాత నిర్మించిన ‘చంద్రహారం’ (1954) చిత్రంలో సావిత్రి వ్యాంప్ రోల్ చేయడం విశేషం. ఇందులో హీరోను వరించి తీసుకొని వెళ్ళే వ్యాంప్ లక్షణాలుగల దేవకన్య వేషం వేసింది మహానటి.
ఈ సినిమా బాగా ఆదరణ పొందింది. ఆ తర్వాత సావిత్రి దశ తిరిగిపోయింది. పెద్ద హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఆ మరుసటి ఏడాదే `మిస్సమ్మ`లో నటించే అవకాశం అందుకుంది.
ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత సావిత్రి మహానటిగా సృష్టించిన సంచలనాలు ఎలాంటివో అందరికి తెలిసిందే.