భారతీయ ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలు సినిమాటిక్ సబ్జక్ట్స్. ముఖ్యంగా మహాభారతం అతిపెద్ద పొలిటికల్ డ్రామా. రాజ్యం, అధికారం, హోదా చుట్టూ కథ నడుస్తుంది. మహాభారతంపై ఇప్పటికే వందల చిత్రాలు తెరకెక్కాయి. అయినప్పటికీ ఈ జనరేషన్ డైరెక్టర్ మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ గా ఉంది. రాజమౌళి లాంటి దేశం మెచ్చిన దర్శకుడు సైతం మహాభారతం తన కలల ప్రాజెక్ట్ అని చెప్పారు. బడా నిర్మాతలు వేయి కోట్ల బడ్జెట్ తో మహాభారతం నిర్మిస్తున్నట్లు ప్రకటనలు చేశారు. కొన్ని ప్రాజెక్ట్స్ ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మహాభారతంలో ప్రతి పాత్రకు ఒక ఔన్నత్యం ఉంటుంది.కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు వంటి పాత్రలు గొప్ప హీరోయిజం కలిగి ఉంటాయి. అభిమానులు తమ హీరో అలాంటి ఐకానిక్ రోల్ చేయాలని కోరుకుంటారు. ఓ ఔత్సాహికుడు సౌత్ ఇండియా స్టార్స్ కలిసి మహాభారతం చేస్తే వారి పాత్రల లుక్స్ ఎలా ఉంటాయనే ఆలోచనతో ఒక వీడియో చేశాడు. సదరు వీడియోలో స్టార్స్ మార్ఫింగ్ ఫోటోలు అద్భుతం ఉన్నాయి. వాటిపై మీరు కూడా ఒక లుక్ వేయండి.