Prema Entha Madhuram: అంజలికి వార్నింగ్ ఇచ్చిన మదన్.. ఆర్యకి తలనొప్పిగా మారిన మాన్సీ!

Published : May 03, 2023, 07:19 AM IST

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. ప్రత్యర్ధుల కుట్రలో చిక్కుకుపోయిన ఒక బిజినెస్ టైకూన్ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అన్నదే ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Prema Entha Madhuram: అంజలికి వార్నింగ్ ఇచ్చిన మదన్.. ఆర్యకి తలనొప్పిగా మారిన మాన్సీ!

ఎపిసోడ్ ప్రారంభంలో మీకు నేను హెల్ప్ చేస్తాను అంటుంది అంజలి. పెదనాన్న నీకు ఆస్తులు ఇచ్చింది ఇలాంటి అడ్డమైన వాళ్లకి ధారపోయటానికి కాదు, ఇలాంటి మనుషులు పేరు, గొప్ప ఊరు దిబ్బ చెప్పుకోవటానికి తప్పితే వీళ్ళ దగ్గర ఏమీ ఉండదు. నువ్వు డబ్బు ఇస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను అంటూ చెల్లెలికి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మదన్.
 

28

తను అంతే ఆలోచించకుండా మాట్లాడుతాడు, నేను మా అన్నయ్యని ఒప్పిస్తాను, అప్పు నువ్వు సార్ ని ఒప్పించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంజలి. అర్జెంటుగా బోర్డు మీటింగ్ అరేంజ్ చేయమని జెండేకి చెప్తాడు ఆర్య. మరోవైపు మదన్, ఆర్య కంపెనీలో ఒక బోర్డు మెంబర్ తో మాట్లాడుతూ ఆర్య ని దెబ్బ కొట్టడానికి ఇదే కరెక్ట్ టైం అంటాడు.
 

38

ఆర్య వర్ధన్ అంత త్వరగా చేతులు ఎత్తేసే వ్యక్తి కాదు, కోర్టులో చూశారు కదా ఎలా చెమటలు పట్టించారో అంటాడు బోర్డు మెంబర్. ఇప్పుడు మనం అతనికి చెమటలు పట్టించాలి, అతని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఆర్య వర్ధన్ కంపెనీలు ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు జరగాలి. అప్పుడే గవర్నమెంట్ ఆర్య మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తుంది.
 

48

అప్పుడే అతని కంపెనీలు వేలానికి వస్తాయి. అప్పుడు ఆ కంపెనీలని నేను కొంటాను. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని మదన్ గ్రూప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇండస్ట్రీస్ గా మారుస్తాను అంటాడు మదన్. ఇంతలో బోర్డు మీటింగ్ కి రమ్మంటూ మెసేజ్ వస్తుంది ఆ వ్యక్తికి. అదే విషయాన్ని మదన్ తో చెప్తాడు బోర్డు మెంబర్. ఏ కంపెనీని అక్షన్ కి పెడుతున్నాడో కనుక్కో ఆ కంపెనీని నేను కొంటాను అని చెప్పి బోర్డు మెంబర్ ని పంపిస్తాడు మదన్.

58

నీ పతనం మొదలైంది, నీ సింహాసనం మీద నేను కూర్చోబోతున్నాను అనుకుంటాడు మదన్. మరోవైపు మీటింగ్ లో ఉన్న మాన్సీ ఎమర్జెన్సీ మీటింగ్ ఎందుకు పెట్టామో మీ అందరికీ తెలుసు కదా, మీటింగ్ ని ప్రారంభించే ముందు నా నిర్ణయాన్ని చెప్తాను వినండి. అసలు మనం షేర్ హోల్డర్స్ కి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటూ అంటుంది మాన్సీ. కంపెనీ షేర్స్ వాల్యూ పడిపోతే మనది తప్పు కాదు కదా, మనము ఒక్క రూపాయి కూడా ఇవ్వము అంటే వాళ్ళు ఏం చేస్తారు. మనందరినీ ఇదే మాట మీద ఉంటే నేను మీడియా వాళ్ళని పిలిచి ఇదే మాట చెప్తాను అంటుంది మాన్సీ. 

68

సారీ మేడం నిర్ణయం తీసుకోవాల్సింది మీరు మేము కాదు ఆర్య సార్ అంటారు బోర్డు మెంబర్స్. ఆయన బోర్డు మెంబర్ కాదు కదా అయినా ఆయన ఇప్పుడు ఎందుకు వస్తారు అంటూ అసహనంగా మొహం పెడుతుంది మాన్సీ. ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆయన ఆల్రెడీ బయలుదేరిపోయారు అంటాడు జెండే. ఇంతలోనే ఆఫీస్ లో అందరూ ఆర్య సార్ వెల్కమ్ అంటూ పెద్దగా అరుస్తారు. ఏంటా క్రౌడ్ అని అడుగుతుంది మాన్సీ. ద టోర్నడో ఇస్ ఎరైవ్డ్ అని జెండే అనేసరికి రూమ్ లోకి వస్తారు అను, ఆర్య వర్ధన్.

78

నీరజ్ తనని రిసీవ్ చేసుకుని ఎండి సీట్లో కూర్చోబెడతాడు. నా నిర్ణయాన్ని వినండి అంటాడు  ఆర్య. డబ్బులు తిరిగి ఇద్దామని మాత్రం చెప్పొద్దు అంటూ పొగరుగా మాట్లాడుతుంది మాన్సీ. అప్పుడు ప్రజల బాధలు వాళ్లకి వీడియో ద్వారా చూపిస్తాడు ఆర్య. వాళ్ల బాధలు తీరాలంటే వాళ్లు లాస్ అయిన ప్రాఫిట్ మనం ఇవ్వాలి, అలా ఇవ్వాలి అంటే మనకున్న కంపెనీలలో ఒక కంపెనీ అమ్మాలి. అందుకు నందిని టెక్స్టైల్స్ కంపెనీ కరెక్ట్ అయినది అంటాడు ఆర్య. అందుకు నేను ఒప్పుకోను అంటూ పొగరుగా మాట్లాడుతుంది మాన్సీ. నేను చెప్పేది విను మాన్సీ అంటూ గట్టిగా కేకలు వేస్తాడు ఆర్య. మీరు ఏ కంపెనీ అమ్మినా మాకు ప్రాబ్లం లేదు అంటూ సపోర్ట్ ఇస్తారు బోర్డు మెంబర్స్. 

88

కానీ మాన్సి మాత్రం తెలివైనవాడు ఎవడు అలాంటి ప్రాఫిట్స్ వచ్చే కంపెనీని అమ్ముకోడు అంటుంది. మార్కెట్ సంగతి మీకు ఇంకా తెలీదు అంటూ జెండే చెప్తాడు. అను కూడా అదే చెప్తుంది. ఇలాంటి లాజిక్కులు చెప్పి ఎవరిని మాయ చేస్తారు అంటుంది మాన్సీ. అందరూ యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఒక్కదానివే ఎందుకు ఇలా మాట్లాడతావ్ అంటూ మందలిస్తాడు నీరజ్. నా కాన్సెప్ట్ ఒకటే మనం ఏ ఆస్తులు అమ్మకూడదు, అమ్మనివ్వను కూడా అంటుంది మాన్సీ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

click me!

Recommended Stories