30 కోట్లు కూడా ఖర్చు అవ్వలేదు.. 300 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా.. ఓటీటీలొ దుమ్మురేపుతోన్న బెత్లెహెమ్ కుటుంబ యూనిట్

Published : Oct 03, 2026, 03:18 PM IST

Bethlehem Kudumba Unit: ఓటీటీలో మాలయాళ సినిమాలకు డిమాండ్ పెరిగిపోతోంది. తెలుగు ఆడియన్స్ కూడా ఆ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. రీసెంట్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కిన ఓ సినిమా.. 30 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కి.. 300 కోట్లకు పైగ వసూలు చేసింది.

PREV
15
మలయాళ సినిమాలకు ఫుల్ డిమాండ్..

మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అద్భుతమైన కథలెన్నో బయటకు వస్తున్నాయి. అవి సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ను కూడా అలరిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ఓటీటీ ప్రేక్షకులు మలయాళ సినిమాలకు ఫిదా అవుతున్నారు. డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో పాటు వినోదాత్మక సినిమాలు, థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీస్.. బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడంతో పాటు ఓటీటీలో కూడా అద్భుతాలే చేస్తున్నాయి.

ఈ క్రమంలో వచ్చిన సినిమానే బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit). థియేటర్లలో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో రికార్డులు తిరగరాసిన ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా నిలిచింది 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్'.

25
ఆకట్టుకునే ప్రేమకథ - నవ్వుల పువ్వులు

కేవలం రూ. 30 కోట్ల లోపు పరిమిత బడ్జెట్‌‌తో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో రూ. 300 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లను సాధించి అసాధారణ విజయాన్ని నమోదు చేసుకుంది. మలయాళ స్టార్ నటుడు నివిన్ పౌలీ, క్రేజీ హీరోయిన్ మమితా బైజు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించారు. 'ప్రేమలు' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత గిరీష్ అందించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను విశేషంగా ఆకట్టుకుంది.

35
కుటుంబ కథా చిత్రం..

ఈ చిత్రంలో నివిన్ పౌలీ 'జస్టిన్' అనే క్యాటరింగ్ వ్యాపారం చేసే వ్యక్తి పాత్రలో నటించగా, మమితా బైజు 'యాష్లే' అనే కాలేజ్ విద్యార్థినిగా కనిపించింది. వయసులో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ, జస్టిన్ మంచి మనసుకు ఆకర్షితురాలైన యాష్లే అతనితో ప్రేమలో పడుతుంది. ఈ విచిత్రమైన 'ఏజ్ గ్యాప్' లవ్ స్టోరీ , వారి కుటుంబాల మధ్య జరిగే డ్రామా, సంభాషణలు, సహజమైన కామెడీ ప్రేక్షకులకు హాయిగా నవ్వుకునే అనుభూతిని అందిస్తాయి.

45
విమర్శకుల ప్రశంసలు - ప్రముఖుల పాత్ర

సినిమాలోని బలమైన స్క్రీన్‌ప్లే, విష్ణు విజయ్ అందించిన సంగీతం, అజ్మల్ సాబు ఛాయాగ్రహణం విశేషంగా నిలిచాయి. ప్రముఖ నటులు ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించడం మరో ప్రత్యేకత. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి కూడా డబ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.

55
ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు

థియేటర్లలో దాదాపు నెల రోజులకు పైగా సక్సెస్ ఫుల్‌‌గా రన్ అయిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ను సాధించింది. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్‌ అవుతోంది. . థియేటర్లలో ఈ హృద్యమైన ప్రేమకథను, హస్య రసాన్ని మిస్సయిన ప్రేక్షకులు, తమ ఇళ్లలోనే డిజిటల్ రూపంలో వీక్షించేందుకు ఎగబడుతున్నారు. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీకి హాట్ స్టార్ తో కూడా భారీగాస్పందన వస్తోంది. తెలుగు వర్షన్ మూవీని కూడా బాగా ఆధరిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories