పవన్ కళ్యాణ్ తో నటించి తెరమరుగైన హీరోయిన్స్! వీళ్లంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

Published : Dec 08, 2023, 09:48 PM IST

పవన్ కళ్యాణ్ హీరోయిన్స్ ని ఒక బ్యాడ్ సెంటిమెంట్స్ వెంటాడుతుంది. ఆయనతో జతకట్టిన మెజారిటీ హీరోయిన్స్ సక్సెస్ కాలేదు. మెల్లగా ఫేడ్ అవుట్ అయ్యారు.   

PREV
113
పవన్ కళ్యాణ్ తో నటించి తెరమరుగైన హీరోయిన్స్! వీళ్లంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

రాజమౌళి తో మూవీ చేసిన హీరో నెక్స్ట్ మూవీ ప్లాప్ అవుతుంది. సింహ టైటిల్ లో ఉంటే బాలయ్య సినిమా హిట్ అవుతుంది. మూడు అక్షరాల టైటిల్ మహేష్ కి కలిసొస్తుంది... ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ లో అనేక సెంటిమెంట్స్ ఉన్నాయి. నిజానికి సెంటిమెంట్  అనేది మూఢనమ్మకం. కానీ ప్రతిసారీ జరుగుతుంటే నమ్మాలనిపిస్తుంది. పవన్ తో జతకట్టిన హీరోయిన్ కెరీర్ మటాష్ అవుతుందనే సెంటిమెంట్ కూడా వాటిలో ఒకటి... దాదాపు పది మందికి పైగా హీరోయిన్స్ ఈ సెంటిమెంట్స్ కి బలయ్యారు... ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ నుండి నికీషా పటేల్ వరకూ ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు...
 

213


అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ పవన్ డెబ్యూ మూవీ 'ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి'లో హీరోయిన్ గా నటించారు. తర్వాత ఆమె కనిపించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా గూఢచారి లాంటి చిత్రాలు చేశారు. 
 

313
Devayani

పవన్-దేవయాని కాంబినేషన్ లో వచ్చిన సుస్వాగతం సూపర్ హిట్ అందుకుంది. దేవయాని మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. 
 

413


తొలిప్రేమ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా ఉంది. ఆ చిత్ర హీరోయిన్ కీర్తి రెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. పరిశ్రమకు దూరమైన కీర్తి రెడ్డి పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. పవన్ సెంటిమెంట్ కి బలైన ఆమె పరిశ్రమలో కనుమరుగైపోయారు. 
 

513
photo credit-preeti insta

తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగానియా పరిస్థితి కూడా సేమ్, మంచి పాపులారిటీ తెచ్చుకొని కూడా కెరీర్ లో ఎదగలేకపోయారు. ప్రీతి కూడా వివాహం చేసుకుంది. 
 

613

ఇక బద్రి సినిమాలో హీరోయిన్స్ గా నటించిన అమీషా పటేల్,రేణూ దేశాయ్ కూడా ఈ బ్యాండ్ సెంటిమెంట్ ని అధిగమించలేక పోయారు. రేణు ఆయన్నే పెళ్లి చేసుకొని కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. 
 

713

అమీషా పటేల్ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. బద్రి అనంతరం తెలుగులో ఆమె చేసిన నరసింహుడు అట్టర్ ప్లాప్. బాలీవుడ్ లో కూడా ఆమె స్టార్ కాలేకపోయింది. 
 

813
Meera jasmine

ఇక గుడుంబా శంకర్ సినిమాలో పవన్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది మీరా జాస్మిన్. ఈ మూవీ పరాజయం కాగా మీరా జాస్మిన్ కెరీర్ కూడా గాల్లో కలిసిపోయింది.

913
Meera chopra


బంగారం అంటూ బరిలో దిగిన మీరా చోప్రా పరిస్థితి అగమ్యగోచరం. పవన్ బంగారం ప్లాప్ కావడంతో పాటు మీరా కెరీర్ కి చరమ గీతం పాడింది. మీరా చోప్రా వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. 

1013


ఇక జల్సాలో జతకట్టిన ఇలియానా కళ్ళముందే కనుమరుగై పోయింది. బాలీవుడ్ అంటూ ముంబై పోయి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. జల్సా తర్వాత ఆమె టైం రివర్స్ అయ్యింది. బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేసిన ఇలియానా అబ్బాయికి జన్మనిచ్చింది. 
 

1113

పవన్ సెంటిమెంట్ కి బలైన మరో యంగ్ హీరోయిన్ నికీషా పటేల్. పవన్ తో ఛాన్స్ కొట్టేశానని ఎగిరి గంతేసిన ఆమె ఆనందం ఆవిరైపోయింది. ఆమె హీరోయిన్ గా నటించిన పులి అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ఆపై నికీషా పటేల్ కి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. మెల్లగా ఫేడ్ అవుటై ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయింది.

1213
സാറ ജെയ്‌ന്‍ ഡയാസ്


పంజా సినిమాలో పవన్ కి జంటగా కనిపించిన సారా జేన్ దియాస్, అంజలి లావణ్య ఎటెళ్ళారో దేవుడికే తెలియాలి. ఈ ఇద్దరు హీరోయిన్స్ కెరీర్లో సక్సెస్ కాలేకపోయారు. 

1313
Anu Emmanuel

అజ్ఞాతవాసి చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. కీర్తి సురేష్ పవన్ సెంటిమెంట్ ని అధిగమించి స్టార్ అయ్యింది. అను ఇమ్మానియేల్ మాత్రం బలైంది. ఆమెకు కనీస అవకాశాలు లేవు. దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ఇలా పదికి పైగా హీరోయిన్స్ పవన్ తో నటించి పరిశ్రమ నుండి వెళ్లిపోయారు.

Read more Photos on
click me!

Recommended Stories