ప్యాంట్‌ వేసుకోకుండానే వరుణ్‌ తేజ్‌తో విదేశీ వీధుల్లో లావణ్య త్రిపాఠి రచ్చ.. పెళ్లికి ముందే రెచ్చిపోతున్న జంట

Published : Jul 13, 2023, 10:03 AM IST

తెలుగు హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం వెకేషన్‌లో బిజీగా ఉంది. గత నెలలో వరుణ్‌ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ భామ ఇప్పుడు పెళ్లికి ముందే కాబోయే భర్తతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.   

PREV
16
ప్యాంట్‌ వేసుకోకుండానే వరుణ్‌ తేజ్‌తో విదేశీ వీధుల్లో లావణ్య త్రిపాఠి రచ్చ.. పెళ్లికి ముందే రెచ్చిపోతున్న జంట

లావణ్య త్రిపాఠి ప్రస్తుతం విదేశాల్లో రచ్చ చేస్తుంది. ఇందులో ఆమె ప్యాంట్‌ వేసుకోకుండా ఫారెన్‌ స్ట్రీట్స్ లో హల్‌చల్‌ చేస్తుండటం విశేషం. వైట్‌ టాప్‌లో వైట్‌ ఫ్రేమ్‌, బ్లాక్‌ స్టయిలీష్‌ గ్లాసెస్‌ ధరించి ఆకట్టుకుంటుందీ అందాల భామ. కత్తిలాంటి పోజులతో కట్టిపడేస్తుంది. 
 

26

లావణ్య త్రిపాఠి మాత్రమే కాదు, ప్రియుడు, కాబోయే భర్త, టాలీవుడ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ కూడా ఉండటం విశేషం. ఈ అమ్మడు ఫారెన్‌ స్ట్రీట్‌లో వయ్యారంగా హోయలు పోగా, ఆమె అందాన్ని కెమెరాల్లో బందిస్తున్నాడు వరుణ్‌ తేజ్‌. అందుకే ఆ ఫోటోల్లో కనిపించడం లేదు. 
 

36

కానీ ఆ విషయాన్ని మాత్రం లావణ్య వెల్లడించింది. కనిపించని వ్యక్తిని చూడ్డానికి లెఫ్ట్ కి స్వైప్‌ చేయండి అంటూ చిలిపి పోస్ట్ పెట్టిందీ సొట్టబుగ్గల సుందరి. అంతేకాదు పిక్‌ తీసింది వరుణ్‌ తేజ్‌ కొణిదెల అని షార్ట్ గా మెన్షన్‌ చేసింది. మొత్తానికి పెళ్లికి ముందే ఈ ఇద్దరు వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుండటం విశేషం. 
 

46

అంతా మా వరుణ్‌ అన్నా ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. మెగా కోడలు అనేలా డ్రెస్‌ ఉండాలని, మంచి డ్రెస్‌ వేసుకోవాలని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరు మీ జంట బెస్ట్ కపుల్‌ అని, వరుణ్‌ తేజ్‌ లక్కీ పర్సన్‌ అని కామెంట్లు చేస్తుండటం విశేషం. 
 

56

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి `మిస్టర్‌`, `అంతరిక్షం` చిత్రంలో నటించారు. `మిస్టర్‌` సినిమా సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. అప్పట్నుంచి సీక్రెట్‌గా ప్రేమించుకుంటున్న ఈ జంట గతేడాది నుంచి మీడియాకి దొరికిపోయారు. నిజానికి నిహారిక మ్యారేజ్‌ టైమ్‌లోనూ వార్తలొచ్చాయి. వాటిని దాటవేస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు తమ ప్రేమని ప్రకటించుకుని గత నెలలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. 

66

త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. వరుణ్‌ తేజ్‌ సినిమా షూటింగ్‌ల నుంచి కాస్త ఫ్రీ అయ్యాక ఈ పెళ్లి చేసుకోబోతున్నారని, గ్రాండ్‌గా మ్యారేజ్‌కి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు లావణ్య త్రిపాఠి సైతం సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతుంది. ఆమె ఇప్పటికే మూడు సినిమాలకు సైన్‌ చేసినట్టు పీఆర్‌ టీమ్‌ ప్రకటించింది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా కొనసాగుతుందని హింట్‌ ఇచ్చిందీ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories