ఆరోగ్యంపై లావణ్య త్రిపాఠి స్పెషల్ ఫోకస్.. యోగా ఫోజులతో ఆకట్టుకుంటున్న ‘అందాల రాక్షసి’..

Published : May 29, 2022, 06:14 PM IST

హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తన ఆరోగ్యానికి తగినంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రారంభమైన యోగా ఉత్సవ్ లో ఈ ‘అందాల రాక్షసి’  పాల్గొని ఇతరులకు స్ఫూర్తిగా నిలిచింది.  

PREV
16
ఆరోగ్యంపై లావణ్య త్రిపాఠి స్పెషల్ ఫోకస్.. యోగా ఫోజులతో ఆకట్టుకుంటున్న ‘అందాల రాక్షసి’..

యూపీ బ్యూటీ లావణ్య త్రిపాఠి తన కేరీర్ ను మోడల్ గా ప్రారంభించింది. 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ ను కూడా గెలుచుకుంది. కొద్ది కాలం టెలివిజన్ షోలోనూ వర్క్ చేసింది. ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సినీ కేరీర్ ప్రారంభించింది. 
 

26

2012లో ఎస్ఎస్ రాజమౌళి సమర్సణలో వచ్చిన సూపర్ హిట్ రొమాంటిక్ ఫిల్మ్ ‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిచిత్రంతోనే లావణ్య త్రిపాఠి భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంది.

36

ఆ తర్వాత ‘మనం, భలే భలే మొగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన, ఉన్నది ఒక్కటే జిందగీ, అంతరిక్షం’ వంటి చిత్రాల్లో నటించి తన పాపులారిటీ మరింత పెంచుకుంది. అయితే త్రిపాఠి తన 10 ఏండ్ల సినీ కేరీర్ లో ఇప్పటి వరకు 20 చిత్రాల్లో నటించింది. కానీ అందాల రాక్షసి లాంటి మరో హిట్ తన ఖాతాలో పడలేదు.
 

46

రోటీన్ కథలు, పాత్రల్లో నటిస్తూ రావడంతో లావణ్య  కేరీర్ అలాఅలానే ముందుకు వెళ్తోంది. సరైన కథలను ఎంచుకుని ఉంటే.. లావణ్య స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో బిజీగా ఉండేదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా ఇప్పటికీ లావణ్యకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.

56

ఇందుకోసం ఈ బ్యూటీ కూడా గ్లామర్. ఫిట్ నెస్ పైనా ఫోకస్ పెడుతోంది. తాజాగా తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ హైదరాబాద్ లో ప్రారంభమైన యోగా ఉత్సవ్ లో పాల్గొంది. ఈ సందర్భంగా యోగా దుస్తుల్లో అందరితో కలిసి యోగా చేసింది. పలు పోజులకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో తాజాగా పంచుకుందీ బ్యూటీ. 
 

66

వచ్చే నెలలో 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022ను పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం మే27న యెగా ఉత్సవ్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 10, 000 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద్ సోన్వాల్ కూడా పాల్గొన్నారు.
 

click me!

Recommended Stories