పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్ మధ్య గొడవ..క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌.. మహేష్‌ ఫ్యాన్స్ సపోర్ట్?

Published : May 29, 2022, 05:41 PM ISTUpdated : May 29, 2022, 07:45 PM IST

సోషల్‌ మీడియాలో ఊహించిన వార్‌ నడుస్తోంది. ప్రభాస్‌, పవన్‌ ఫ్యాన్స్‌ మధ్య వార్‌ జరుగుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనికి మహేష్‌ అభిమానులు సపోర్ట్ చేయడం సంచలనంగా మారింది. 

PREV
17
పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్ మధ్య గొడవ..క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌.. మహేష్‌ ఫ్యాన్స్ సపోర్ట్?

సోషల్‌ మీడియాతో తరచూ ఫ్యాన్స్ మధ్య వార్‌ జరుగుతుంటుంది. ఎక్కువగా మహేష్‌, బన్నీ ఫ్యాన్స్ మధ్య, అలాగే అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య, మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది. అప్పుడప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్ కూడా ఈ గొడవల్లో ఇన్‌వాల్వ్ అవుతుంటారు. పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మొత్తంగా ఫ్యాన్స్‌ వార్‌ తరచూ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌ అవుతుంటుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. 

27

ఇదిలా ఉంటే ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్‌(Prabhas), పవన్‌కళ్యాణ్‌(Pawan Kalyan) ఫ్యాన్స్ మధ్య వార్‌ జరుగుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, డార్టింగ్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది.సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. 

37

ఇందులో ప్రభాస్‌ ఫ్యాన్స్ పవన్‌ కళ్యాణ్‌ని(Prabhas Pawan Fans War) క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. పవన్‌ ప్రభాస్‌కి సారీ చెప్పాలంటూ `#PKShouldSayApologizeToPrabhas` అనే యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. ఇదిప్పుడు సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

47

ఇంత వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇందులో మహేష్‌బాబు ఫ్యాన్స్ జోక్యం చేసుకోవడం మరింత రచ్చ లేపుతుంది. ప్రభాస్‌ ఫ్యాన్స్ కి సపోర్ట్ చేస్తూ మహేష్‌(Mahesh)అభిమానులు కూడా ట్వీట్లు చేస్తున్నారు. ప్రభాస్‌ అభిమానుల నినాదాన్ని మరింత బలంగా వినిపిస్తూ పవన్‌ కళ్యాణ్‌.. ప్రభాస్‌కి క్షమాపణాలు చెప్పాలనే డిమాండ్‌ని మరింతగా పెంచుతున్నారు.

57

అయితే అసలు పవన్‌ కళ్యాణ్‌.. ప్రభాస్‌కి ఎందుకు సారీ చెప్పాలనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమవుతుంది. అసలు కారణమేంటనేది అర్థం కాక సాధారణ నెటిజన్లు ఆయోమయానికి గురవుతున్నారు. తికమకపడుతున్నారు. పవన్‌.. ప్రభాస్‌ని ఏమన్నాదనేది ప్రశ్నిస్తున్నారు. దీంతో `#PKShouldSayApologizeToPrabhas reason` కూడా ట్రెండింగ్‌ కావడం విశేషం. 

67

పవన్‌ కళ్యాణ్‌ అభిమాని ఒకరు ఏపీలో ప్రభాస్‌ అభిమానులను ఉద్దేశించి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని, డార్లింగ్‌ ఫ్యాన్స్ పై సెటైర్లు వేశారనే నెపంతో పవన్‌ కళ్యాణ్‌ని ఆడుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనికి మహేష్‌ ఫ్యాన్స్ కి సపోర్ట్ చేస్తుండటంతో ఇది పెద్ద రచ్చ అవుతుంది. ట్విట్టర్‌ లో ఓ రేంజ్‌లో ఈ యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

77

ప్రస్తుతం పవన్‌ కళ్యాన్‌ `హరిహరవీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో హరీష్‌ శంకర్‌తో సినిమా `భవదీయుడు భగత్‌సింగ్‌`ని స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే ప్రభాస్‌ ప్రస్తుతం `సలార్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రాల్లో నటిస్తున్నారు. `ఆదిపురుష్‌` విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు మహేష్‌ ఇటీవల `సర్కారువారిపాట`తో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్‌ సినిమాలో నటించబోతున్నారు. అలాగే రాజమౌళితోనూ ఓ సినిమా చేయనున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories