వరుణ్‌ తేజ్‌పై తన క్రష్‌ని బయటపెట్టిన లావణ్య త్రిపాఠి.. నాని కంటే అతనే.. అంటూ షాక్‌..

Published : Feb 19, 2023, 08:30 PM IST

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజాగా లావణ్య.. వరుణ్‌పై తనకున్న క్రష్‌ని వెల్లడించి షాకిచ్చింది.   

PREV
15
వరుణ్‌ తేజ్‌పై తన క్రష్‌ని బయటపెట్టిన లావణ్య త్రిపాఠి.. నాని కంటే అతనే.. అంటూ షాక్‌..

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తుందంటూ చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ మధ్య ఏకంగా వీరిద్దరు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారంటూ ప్రచారం జరిగింది. త్వరలోనే పెళ్లి ప్రకటన రాబోతుందంటూ వార్తలొచ్చాయి. అంతేకాదు ఒకటి రెండు పార్టీల్లో ఈ ఇద్దరు పాల్గొన్నారు. దీంతోపాటు నిహారిక పెళ్లికి ఇండస్ట్రీ నుంచి కేవలం లావణ్య త్రిపాఠి మాత్రమే హాజరయ్యారు. దీంతో వరుణ్‌తేజ్‌తో ఎఫైర్లు మరింత ఊపందుకున్నాయి. 
 

25

కానీ ఇందులో నిజం లేదని లావణ్య త్రిపాఠి కొట్టిపారేసింది. అందులో నిజం లేదని, ఉట్టి పుకార్లే అని చెప్పింది. కానీ ఇప్పుడు మరోసారి తన క్రష్‌ని వెల్లడించింది లావణ్య త్రిపాటి. వరుణ్‌ తేజ్‌ మోస్ట్ హ్యాండ్సమ్‌ అని చెప్పింది. నానితో పోల్చితే వరుణ్‌ తేజ్‌నే అందంగా ఉంటాడని పేర్కొంది. ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి షాక్‌కి గురి చేస్తుంది. మరి ఏ సందర్భంలో లావణ్య ఇలా స్పందించిందనేది చూస్తే, 
 

35

లావణ్యత్రిపాఠి తాజాగా `పులిమేక` అనే చిత్రంలో నటించింది. బిగ్‌ బాస్‌ సిరి కూడా ఇందులో యాక్ట్ చేసింది. ఈ టీమ్‌ సుమ యాంకర్‌గా చేస్తున్న `సుమా అడ్డా` షోలో పాల్గొన్నారు. క్యాష్‌కి ఆల్టర్‌నేట్‌గా వస్తున్న షో ఇది. ఇందులో కొనవెంకట్‌ కూడా పాల్గొన్నారు. అయితే వీరితో సుమ గేమ్‌లు ఆడిస్తూ, ప్రశ్నలు సందిస్తూ, ఆడియెన్స్ తో డైలాగులు చెప్పిస్తూ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఓ కుర్రాడు ఏకంగా లావణ్య త్రిపాటి లాంటి అమ్మాయి కావాలని చెప్పాడు. అలా అయితే కన్యాశుల్కం ఇవ్వాలని సుమ అనగా, నా జీవితాన్నే ఇచ్చేస్తానని చెప్పడంతో లావణ్య త్రిపాఠి సైతం ఫిదా అయ్యింది. 

45

అనంతరం లావణ్య త్రిపాఠిని ప్రశ్నించింది యాంకర్‌ సుమ. మోస్ట్ హ్యాండ్సమ్‌ హీరో ఎవరని అడితే మీరు ఎవరి పేరు చెప్తారు అంటూ ఏ-నాని, బీ-వరుణ్‌ తేజ్‌ పేర్లు చెప్పింది సుమ. దీనికి లావణ్య త్రిపాఠి రియాక్ట్ అవుతూ, వరుణ్ తేజ్‌ పేరు చెప్పింది. వరుణ్ మోస్ట్ హ్యాండ్సమ్‌ హీరో అని ఆమె తన మనసులోని మాటని చెప్పింది. దీంతో సుమతోపాటు కోనవెంకట్‌, సిరిలు కూడా అవాక్కయ్యారు. ఇక ఆడియెన్స్ హో ఏసుకున్నారు. దీంతో షో మొత్తం హోరెత్తిపోయింది. దీంతో వరుణ్‌పై తనకు ఉన్న క్రష్‌ని ఈ రూపంలో వెల్లడించిందంటున్నారు ఆడియెన్స్. 
 

55

ఇక వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి `మిస్టర్‌`, `అంతరిక్షం` చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు ఆడలేదు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఆ ప్రేమే పెళ్లి వరకు వెళ్లిందని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటనేది మున్ముందు తేలనుందని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories