మత్తు చూపుల్తో మైకంలో ముంచేస్తున్న శ్రీముఖి.. అదిరిపోయే స్టిల్స్ తో కట్టిపడేస్తున్న యంగ్ బ్యూటీ..

First Published | Feb 19, 2023, 5:42 PM IST

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi) వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో స్టన్నింగ్ స్టిల్స్ తో మైమరిపిస్తోంది. లేటెస్ట్ గా మరింత అట్రాక్టివ్ గా దర్శనమిచ్చారు. 
 

‘పటాస్’ కామెడీ షోతో యంకర్ గా శ్రీముఖి బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. తనదైన యాంకరింగ్ స్కిల్స్ తో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. చిలిపి తనం, చురుకుగా వ్యవహరించే తీరుతో యూత్ లో చాలా క్రేజ్ పొందారు. 
 

బుల్లితెరపై బ్యాక్ టు బ్యాక్ షోలతో అలరిస్తూనే ఉన్నారు శ్రీముఖి. యాంకర్ గా ప్రస్తుతం తనకేరీర్ కు ఎలాంటి ఢోకా లేదు. ఒకషో తర్వాత మరోషోతో టీవీ ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉన్నారు శ్రీముఖి. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. 
 


యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న శ్రీముఖి  సమయం ఉన్నప్పుడల్లా తన అభిమానులను నెట్టింట పలకరిస్తూ ఉంటారు. లైవ్ సెషన్స్, చాటింగ్ ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటారు. వారి ప్రశ్నలకు క్యూట్ గా బదులిస్తూ ఆకట్టుకుంటుంటారు. 

మరోవైపు తను హోస్ట్ చేస్తున్న షోలపైనా అప్డేట్ ఇస్తుంటారు శ్రీముఖి. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘బీబీ జోడీ’ డాన్స్ షోలో శ్రీముఖి మెరుస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లేటెస్ట్ ఎపిసోడ్ కోసం స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చారు. 
 

అదిరిపోయే అవుట్ ఫిట్ లో క్రేజీగా ఫొటోషూట్ చేసిన శ్రీముఖి ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకున్నారు. లేటెస్ట్ పిక్స్ లో యంగ్ బ్యూటీ లైట్ పర్పుల్ కలర్ సూట్ లాంటి డ్రెస్ లో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు స్టన్నింగ్ స్టిల్స్ తో అదరగట్టింది.
 

యంగ్ బ్యూటీ మతిపోయే పోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు ఓరచూపులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. మత్తుకళ్లతో మయాజేసింది. లైట్ కలర్ డ్రెస్ లో కుర్ర భామ అందం మరింతగా మెరిసిపోతోంది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో పిక్స్ ను క్షణాల్లోనే వైరల్ చేస్తున్నారు. 
 

ఇక శ్రీముఖి ప్రస్తుతం ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (Aadivaaram with star maa parivaaram),  ‘డాన్స్ ఐకాన్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’ వంటి షోలకూ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దాంతో పాటుగా ‘బీబీ జోడీ’లోనూ మెరుస్తున్నారు. 

యాంకర్ గానే కాకుండా.. నటిగానూ వెండితెరపై అలరించేందుకు ప్రయత్నిస్తోందీ బ్యూటీ. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. అల్లు అర్జున్న ‘జులాయి’ చిత్రం నుంచి వరుసగా ఆయా సినిమాల్లో మెరుస్తూనే ఉంది.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లో ఓ పాత్రను పోషిస్తోంది. 
 

Latest Videos

click me!