Lavanya Tripathi: స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, మెడలో హారం చీరలో అందం ఓవర్‌లోడ్‌.. లావణ్యలో ఉట్టిపడుతున్న పెళ్లికళ

Published : Sep 21, 2023, 08:37 PM IST

`అందాల రాక్షసి` లావణ్య త్రిపాఠి.. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెడుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉంది. తాజాగా పెళ్లి కూతురుని తలపించేలా ఫోటో షూట్‌ చేయడం విశేషం.   

PREV
17
Lavanya Tripathi: స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, మెడలో హారం చీరలో అందం ఓవర్‌లోడ్‌.. లావణ్యలో ఉట్టిపడుతున్న పెళ్లికళ

టాలీవుడ్‌ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి.. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లని ప్రారంభించారు. ఆ మధ్య మనీష్‌ మల్హోత్రా డిజైనింగ్‌ కంపెనీకి వరుణ్‌, లావణ్య వెళ్లారు. మ్యారేజ్‌ కి సంబంధించిన డిజైన్‌ ఆర్డర్‌ ఇచ్చినట్టు సమాచారం. 
 

27

ఇదిలా ఉంటే తాజాగా లావణ్య త్రిపాఠి పెళ్లి కూతురిని తలపిస్తుంది. పెళ్లి కళ ఆమెలో ఉట్టిపడుతుంది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించి, లైట్‌ బ్లూ కలర్‌ ప్రింటెడ్‌ శారీలో హోయలు పోయింది. మెడలో పెద్ద హారం ధరించి కిర్రాక్‌ పోజులిచ్చింది. నిషా ఎక్కించే కళ్లతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

37

ఇందులో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది లావణ్య త్రిపాఠి. చీర కట్టుకుని చూస్తే చాలు అని పేర్కొంది. చీరలో చంపేస్తున్నట్టు వెల్లడించిందీ అందాల రాక్షసి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ కావడంతోపాటు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇలా చీరలో ఎంతో బ్యూటీఫుల్‌గా ఉన్నావని, అందాల దేవతలా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 
 

47

లావణ్య త్రిపాఠి.. `అందాల రాక్షసి` చిత్రంతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఇందులో కాస్త బోల్డ్ రోల్‌లో కనిపించింది. `పెళ్లి చేయండి నాన్న ఉండలేకపోతున్నా` అంటూ బోల్డ్ గా చెప్పిన డైలాగ్‌ ఆమె జీవితాన్నే మార్చేసింది. దీంతో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయిందీ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. 

57

అయితే లావణ్య త్రిపాఠి మాత్రం చాలా సెలక్టీవ్‌గానే సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో వరుణ్‌ తేజ్‌తో `మిస్టర్‌` చిత్రంలో నటించింది. ఈ సినిమా పరాజయం చెందింది. కానీ వరుణ్‌ తేజ్‌, లావణ్యల ప్రేమకి పునాదులు వేసింది. ఆ తర్వాత `అంతరిక్షం`లో కలిసి నటించారు. ప్రేమని మరింత బలపరుచుకున్నారు. 
 

67

సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారం నడిపించిన ఈ ఇద్దరు గతేడాది దొరికిపోయారు. లావణ్య త్రిపాఠి బర్త్ డే సందర్భంగా వీరి ప్రేమ బయటపడింది. అయినా దాన్ని దాటవేస్తూ, కండిస్తూ వచ్చారు. చివరికి తమ ప్రేమని ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్‌ ద్వారానే తాము ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపారు. 

77

ఇప్పుడు పెళ్లికి సిద్ధపడుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారట. అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా సినిమాలు ఆపేసింది. ఆమె చేతిలో రెండు మూడు సినిమాలున్నాయని అంటున్నారు. కానీ అధికారికంగా ఇంకా ఏదీ ప్రకటించలేదు. మరి సినిమాలు చేస్తుందా? పూర్తిగా మానేస్తుందా? అనేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories