యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం పెను తుఫాన్ లాగా మారుతోంది. రాజ్ తరుణ్ కి తీవ్రమైన చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. దాదాపు దశాబ్దం పైగా వీళ్ళిద్దరూ సహజీవనం చేశారు. ఆమెతో శారీరకంగా సంబంధం ఉన్న మాట వాస్తవమే అని రాజ్ తరుణ్ కూడా మీడియా ముందు ఒప్పుకున్నాడు. అయితే కొందరి వల్ల రాజ్ తరుణ్ తనని పట్టించుకోవడం లేదని లావణ్య ఆరోపిస్తోంది.