మహేష్‌ బాబు, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ కి శంకర్‌ సర్‌ప్రైజ్ లు.. `భారతీయుడు 2`లో ఆ రెండు చోట్ల రచ్చే..

Published : Jul 12, 2024, 05:03 PM IST

దర్శకుడు శంకర్‌.. మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. `భారతీయుడు 2`లో ఆ రెండు చోట్ల ఫ్యాన్స్ కి పండగే..   

PREV
15
మహేష్‌ బాబు, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ కి శంకర్‌ సర్‌ప్రైజ్ లు.. `భారతీయుడు 2`లో ఆ రెండు చోట్ల రచ్చే..

కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన `భారతీయుడు 2` సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. శంకర్‌ రూపొందించిన ఈ మూవీ థియేటర్లో సందడి చేస్తుంది. 1996లో వచ్చిన `భారతీయుడు` సినిమాకి సీక్వెల్‌గా వస్తోన్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికితోడు కమల్‌ హాసన్‌ మరోసారి సేనాపతి మ్యాజిక్‌ చేసేందుకు వస్తున్నారు. అలాగే ఇందులో సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా, ఎస్‌ జే సూర్య కీలక పాత్రలు పోషించడంతో అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఆ భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. రొటీన్‌ స్టోరీ అనే విమర్శలు వస్తున్నాయి. బాగా సాగదీసినట్టుగా ఉందని ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు.   
 

25

రిజల్ట్ పక్కన పెడితే `భారతీయుడు 2`లో మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ పండగ చేసుకునే రెండు సర్‌ప్రైజ్‌లున్నాయి. వాళ్లు థియేటర్లలో డాన్సులేసే సీన్లు పెట్టాడు దర్శకుడు శంకర్‌. ఈ ఇద్దరు ఫ్యాన్స్ కి ఆయన స్వీట్‌ సర్‌ప్రైజ్ ఇచ్చారని చెప్పొచ్చు. మరి ఆ సర్‌ప్రైజ్‌ లేంటనేది చూస్తే.. 
 

35
Guntur Kaaram

`భారతీయుడు 2` సినిమాలో మహేష్‌బాబు, రామ్‌ చరణ్‌ సినిమాల పాటలు పెట్టారు. అది కూడా లేటెస్ట్ సాంగ్స్ కావడం విశేషం. మహేష్‌ బాబు చివరగా `గుంటూరు కారం` సినిమాలో నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ ఇందులో చివర్లో వచ్చే `ఆ కుర్చీని మడత పెట్టి` పాట బాగా పాపులర్ అయ్యింది. ఈ పాటని వాడుకున్నారు శంకర్‌. సినిమాలో `భారతీయుడు` కమ్‌ బ్యాక్‌ యాష్‌ ట్యాగ్‌ట్రెండ్‌ అవుతున్న నేపథ్యంలో హోటల్‌ సీన్‌లో ఈ పాటని పెట్టారు శంకర్‌. ఆ పాట వచ్చే సమయంలో థియేటర్లో ఆడియెన్స్ అరుపులు మామూలు కాదు. మహేష్‌ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. 
 

45

ఆ కంటిన్యూటీలోనే రామ్‌ చరణ్‌ సినిమా పాట వచ్చింది. బస్‌ స్టాండ్‌ సన్నివేశంలో `జరగండి జరగండి` అనే పాటని ప్రదర్శించారు. ఇది `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలోని పాట అనే విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శంకరే దర్శకుడు. ఆ మధ్య ఈ సినిమాలోని మొదటి పాటని విడుదల చేశారు. దానికి మంచి రియాక్షన్‌ వచ్చింది. ఆ పాటనే బస్టాండ్‌ సీన్‌లో వాడటం విశేషం. ఆ పాట వచ్చినప్పుడు కూడా థియేటర్లు దద్దరిల్లాయి. చరణ్‌ ఫ్యాన్స్ రచ్చ చేశారు. అయితే అవి కొన్ని సెకన్ల పాటే రావడం విశేషం. ఇలా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి `భారతీయుడు 2`లో సర్‌ప్రైజ్‌ పెట్టి వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు శంకర్‌. మరి అది సినిమాకి ఎంతగా హెల్ప్ అవుతుందో చూడాలి.
 

55

ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందుతున్న `గేమ్‌ ఛేంజర్‌` చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణదశలో ఉంది. రామ్‌ చరణ్‌ పార్ట్ షూటింగ్‌ అయిపోయిందట. మరికొన్ని రోజుల్లోనే సినిమా కంప్లీట్‌ అవుతుందని, త్వరలోనే రిలీజ్‌పై క్లారిటీ ఇస్తామని ఇటీవల శంకర్‌ తెలిపిన విషయం తెలిసింది. డిసెంబర్‌లో దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌ జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories