Rajini Kamal Friendship: తమిళ సినిమాకు రజనీకాంత్, కమల్ హాసన్ రెండు కళ్ల లాంటి వాళ్లు. వాళ్ల మధ్య పోటీ ఉన్నా, అంతకుమించిన స్నేహం ఉంది. ఈ స్నేహం గురించి లతా రజనీకాంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ సినిమాకు రెండు ధ్రువాల లాంటి వాళ్లు. నలభై ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నా, వాళ్ల మధ్య ఉన్న స్నేహం, గౌరవం, ప్రేమ భారతీయ సినిమాకే ఆదర్శం. అయితే తాజాగా రజనీ, కమల్ స్నేహంపై లతా రజనీకాంత్ స్పందించారు. ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
25
కమల్, రజనీ స్నేహానికి కారణం చెప్పిన లతా రజనీకాంత్
లతా రజనీకాంత్ ప్రకారం, "రజనీ, కమల్ మధ్య ఎప్పుడూ ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు చాలా శ్రద్ధ, స్నేహం చూపిస్తారు. ఒకరి బాగోగుల గురించి మరొకరు ఎప్పుడూ అడిగి తెలుసుకుంటారు. `తెరపై వాళ్ల అభిమానులు గొడవపడినా, నిజ జీవితంలో మాత్రం వాళ్లు మంచి స్నేహితులు. ఒకరికి బాగోలేకపోయినా, జీవితంలో కీలక మలుపులు వచ్చినా ఒకరికొకరు అండగా నిలబడతారు. వాళ్ల స్నేహం ఇంత గొప్పగా ఉండటానికి ఈ కేరింగే కారణమని లతా రజనీకాంత్ తెలిపారు.
35
తమిళ సినిమా స్థాయిని పెంచిన హీరోలు
రజనీకాంత్ సినీ ప్రయాణం చాలా ప్రత్యేకం. "ఎన్ వళి తని వళి" (నా దారి వేరు) అనే ఆయన పంచ్ డైలాగ్ అభిమానులకే కాదు, ఆయనకు కూడా చాలా ఇష్టమని లతా రజనీకాంత్ చెప్పారు. ఆయన సినిమా కోసం తనకంటూ ఒక స్టైల్, ఒక దారి ఏర్పాటు చేసుకుని అందులో గెలిచారు. అలాగే కమల్ హాసన్ కూడా ప్రపంచస్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇద్దరూ వేర్వేరు దారుల్లో ప్రయాణించినా, ఒక దశలో కలిసి నటించి, తమిళ సినిమా స్థాయిని, మార్కెట్‌ని పెంచారని తెలిపారు లతా
రజనీకాంత్ మాటల్లో ఒక అయస్కాంత శక్తి ఉంటుందని లతా రజనీకాంత్ అన్నారు. ఆయన స్పీచ్‌లలో తత్వశాస్త్రం, జీవిత పాఠాలు చాలా ఉంటాయన్నారు. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆధ్యాత్మికత, మానవత్వం వంటి విషయాలపై ఆయన చెప్పే మాటల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చని తెలిపారు. అన్నింటికన్నా ముఖ్యంగా, రజనీకాంత్ మాటలు చాలా సింపుల్‌గా, ఒక సామాన్య వ్యక్తితో సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. తన తప్పును ఒప్పుకోవడంలో, ఇతరులను మెచ్చుకోవడంలో ఆయన చూపించే నిరాడంబరతే కోట్లాది మంది అభిమానులను ఆయన వైపు ఆకర్షించిందని లతా రజనీకాంత్ వివరించారు.
55
చరిత్రలో నిలిచిపోయే స్నేహం
రజనీ-కమల్ ఇద్దరూ తమిళ సినిమాకు రెండు కళ్ల లాంటి వారని లతా రజనీకాంత్ అన్నారు. వృత్తి విషయానికి వస్తే తమ ప్రత్యేక మార్గాల్లో రాజీ పడకుండా కష్టపడతారు. కానీ వ్యక్తిగత జీవితంలో వాళ్లు చూపించే స్నేహం, ప్రేమ తర్వాతి తరానికి ఒక గొప్ప పాఠం. వాళ్ల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పోటీ, బలమైన స్నేహం తమిళ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని వెల్లడించారు. ప్రస్తుతం కమల్, రజనీకాంత్ కలిసి