
ఈరోజు ఎపిసోడ్లో లాస్ట్ కి అన్న అంతరాత్మ ఎలా ఒప్పుకుంటుందనుకున్నావు తులసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనడంతో శృతి వెళ్ళదు అని అనగా వెళ్లి తీరాల్సిందే ఇది నా ఇల్లు ఇంట్లో ఏమి జరిగిన నా ఆధీనంలోనే జరగాలి అని అంటుంది లాస్య. అప్పుడు తులసి చిన్న పిల్లల ప్రవర్తించకు లాస్య ప్రేమ్ నా కొడుకు శృతి నా కోడలు అని అంటుంది. వాళ్లకు సంబంధించిన ఏ చిన్న ఫంక్షన్ అయినా నా చేతుల మీదుగా జరగాలి. కాదు కూడదు అనే హక్కు ఎవరికీ లేదు అని అంటుంది. అప్పుడు లాస్య కోపంతో తులసి చేతిలో ఉన్న స్వీట్స్ పసుపు కుంకుమ అన్ని నేలకేసి విసిరి కొడుతుంది. అది చూసి తులసి,అంకిత, శృతి ముగ్గురు షాక్ అవుతారు.
అప్పుడు తులసి కోపంతో రగిలిపోతూ అసలు నువ్వు మనిషివేనా పసుపు కుంకం నేలకేసి కొడతావా వాటి విలువ నీకు తెలుసా అనడంతో నువ్వు వాటి గురించి చెబితే వినే ఓపిక నాకు లేదు అని అంటుంది లాస్య. నీకు ఇంతకు ముందే మర్యాదగా చెప్పాను నువ్వు వినలేదు అందుకే నేను ఇలా చేశాను అని అంటుంది లాస్య. ఇప్పుడు శృతి నాకోసం వచ్చింది అనగనడంతో అసలు నిన్ను ఎవరు రమ్మని చెప్పామన్నారు అని శృతి మీద పెత్తనం చెలాయిస్తుంది లాస్య. నందు అన్న మాటలు గుర్తుతెచ్చుకొని తులసి వాటిని కవర్ లో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు శృతి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు తులసి ఇంటికి వెళుతూ జరిగిన విషయాలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది.
మరోవైపు సామ్రాట్ తులసి ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉండగా తులసి సామ్రాట్ కి దూరంగా బైక్ ఆపడంతో ఏంటండీ ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. అప్పుడు తులసి అనుకోకుండా బయటికి వెళ్లాల్సి వచ్చింది మీరు వెళ్ళండి సర్ గంటలో వస్తాను అని సామ్రాట్ ని పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్లిన తులసి లాస్య అన్న మాటలు తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండగా ఇంతలోనే సామ్రాట్ అక్కడికి వస్తాడు. నాకు తెలిసిన తులసి గారు ఇలా కష్టాలకు ఏడెవరు అనడంతో దేవుడు పెట్టిన కష్టాలను భరిస్తున్నాను కానీ మనుషులు పెట్టే కష్టాలను భరించలేకపోతున్నాను అంటూ తెలిసి జరిగిందా మొత్తం వివరించి ఏడుస్తూ ఉంటుంది.
అప్పుడు సామ్రాట్ తులసికి నచ్చజెప్పి ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. లాస్య బయటకు గెంటేసిందని ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుని వచ్చారు. మరి మీరు మీ పిల్లలకు ఏం చెబుతున్నారు. మిమ్మల్ని చూసి నేర్చుకోమని చెబుతున్నారా అని అడుగుతాడు సామ్రాట్, మీ మాటకు విలువ ఇచ్చి మీకు గౌరవం ఇచ్చి మీ వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారు కానీ, మిమ్మల్ని కాదనుకుని కాదు నందు లాస్య వాళ్ళని కావాలనుకొని కాదు. అటువంటప్పుడు వారికి జరిగే నష్టాలు, కష్టాలకు మీరే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. పారిపోవడానికి వీల్లేదు తులసి గారు అని అంటాడు. మీరే సంతోషంగా లేనప్పుడు అతని గురించి అతనికి ఇచ్చిన మాట గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అనడంతో తులసి ఆలోచనలో పడుతుంది. నువ్వు ఆలోచించాల్సింది మీ మాజీ భర్త నందగోపాల్ గురించి కాదు నిన్ను కోరుకుంటున్న మీ వాళ్ళ గురించి తులసి ఆలోచనలో పడుతుంది.
ఇప్పటికైనా ఏమి మించిపోలేదు రండి వెళ్దాం వాళ్ళని ఇక్కడికి పిలుచుకొని రండి నేను మీతో పాటు మీతో పాటు మీ పక్కనే ఉంటాను అని అంటాడు సామ్రాట్. అప్పుడు తులసి ధైర్యం తెచ్చుకొని సరే వెళ్దాం పదండి అని అంటుంది. మరొకవైపు నందు ఇంట్లో అందరూ ఒక చోట నిలబడి ఉంటారు. అప్పుడు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా తులసి ఇంటికి వచ్చి వెళుతుందని నీ ముందే బతిమిలాడుకున్నాను. ఆరోజే వద్దు అని నమ్మకం మీద చెప్పి ఉంటే మీ ఇంట్లో ఉండాలా వద్దా అని అప్పుడే నిర్ణయించుకునే వాళ్ళం అనడంతో అమ్మ అని అనగా ఈరోజు తులసి వస్తే ఇంటి గుమ్మం బయటే నుంచే నీ పెళ్ళాం వెళ్ళగొట్టింది అని అంటుంది. తులసిని గోరంగా అవమానించింది.
తులసిని అవమానించడం అంటే మమ్మల్ని అవమానించడమే ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు నోరు ఎత్తకుండా నువ్వు మాట్లాడకుండా ఉన్నావంటే అని నందును నిలదీస్తుంది అనసూయ. అప్పుడు లాస్య ఈ అబ్బాయి మాజీ కోడలికి అన్యాయం జరిగింది అవమానం జరిగింది అంటున్నారు మరి నా విషయంలో జరిగింది ఏంటి అత్తయ్య అని అడగగా నీకు ఏమి అవమానం జరిగింది అని ప్రేమ్ నిలదీయగా ఈ ఇంట్లో మనిషిని అయి ఉండి ఇంట్లో శుభవార్త బయట వాళ్లతో తెలుసుకోవాల్సి వచ్చింది అని అంటుంది లాస్య. ఇది నాకు అవమానం కాదా ఇప్పుడు నిలదీయండి అత్తయ్య అని అంటుంది లాస్య.
ఇప్పుడు నందు లాస్యకి వత్తాసు పలుకుతూ లాస్య అడిగినదాంట్లో కూడా న్యాయం ఉంది అని అంటాడు. లాస్య స్థానంలో ఉంటే నేను కూడా అలాగే చేసే వాడినేమో అని అంటాడు. దాంతో లాస్య మరింత రెచ్చిపోయి అందరిమీద అనందలు వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రేమ్ తన తండ్రిని నిలదీస్తూ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే ఆ ఇంటికి సామ్రాట్ తులసి వస్తారు. అప్పుడు తులసి వాళ్ళను చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు లాస్య చూసావా నందు తను ఒక్కతే వస్తే రానివ్వమని బాడీగార్డ్ ని వెంటబెట్టుకొచ్చింది అని అంటుంది. అప్పుడు నందు సామ్రాట్ మీద సీరియస్ అవుతూ ఎందుకు పదేపదే నువ్వు మా ఫ్యామిలీ విషయాలు జోక్యం చేసుకుంటున్నావు అని నిలదీస్తాడు.
నీ కారణంగా మా మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి అని నందు అనడంతో నావల్ల కాదు నీ భార్య వల్ల అని అంటాడు సామ్రాట్. అప్పుడు తులసి ఆయన ఎక్కడికి వెళ్లరు నాతోనే వచ్చారు నాతోనే ఉంటారు ఆడంతో జీవితాంతం ఉంటారా అని లాస్య వెటకారంగా అడగడంతో అవును అని అంటుంది తులసి. నేను ఇక్కడికి గొడవలు చేయడానికి రాలేదు నాకు కూడా లేని నన్ను కొద్దిసేపు మనశ్శాంతిగా వదిలేస్తే సంతోషపడి వెళ్లిపోతాను అనడంతో అందుకు నందు ఒప్పుకోడు.