'కుర్చీ మడతపెట్టి' కూనీ చేశారు..మహేష్ ఫ్యాన్స్ హర్ట్, ఢీ షో పై నెటిజన్ల కామెంట్స్

బుల్లితెరపై డ్యాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం.

బుల్లితెరపై డ్యాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం.  ఢీ షోలో  యాంకర్ ప్రదీప్ చేసే హంగామా కూడా నవ్వించే విధంగా ఉంటుంది. ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ స్థానంలోకి నటుడు నందు వచ్చారు. 

ఢీ లాంటి షోలలో సెలెబ్రిటీలు చేసే డ్యాన్స్ లు సర్కస్ ని తలపించే విధంగా ఉంటాయనే విమర్శ ఉంది. అయితే తాజాగా ఢీ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షోకి శేఖర్ మాస్టర్, ప్రణీత సుభాష్ జడ్జీలుగా చేస్తున్నారు. 


ఎప్పటిలాగే హైపర్ ఆది, శేఖర్ మాస్టర్ మధ్య కామెడీ సంభాషణ జరిగింది. అయితే ఈ ప్రోమోలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో హైలైట్ అయిన కుర్చీ మడతపెట్టి సాంగ్ ని ఓ జంట పెర్ఫామ్ చేసింది. శేఖర్ మాస్టర్, ప్రణీత ఇద్దరూ వారిని అద్భుతంగా డ్యాన్స్ చేశారని మెచ్చుకున్నారు. 

గుంటూరు కారం చిత్రంలో మాస్ ఆడియన్స్ ని మెప్పించిన ఎలిమెంట్ అంటే కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రమే అని చెప్పాలి. కానీ ఈ సాంగ్ ని కూడా ఢీ షోలో కూని చేసారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కుర్చీని మడతపెట్టి డ్యాన్స్ చేసే విధానం కూడా ఢీ షోలో మెప్పించలేదు. 

ఆ ఒక్క పాటని కూడా కూని చేసేసారు కదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే చివర్లో బిగ్ బాస్ జెస్సీ, శ్రీ ప్రియా డేంజర్ జోన్ లో ఉన్నట్లు నందు ప్రకటించారు. దీనితో చాలా మంది శ్రీప్రియకి సపోర్ట్ చేశారు. 

దీనితో జెస్సీ బాగా హర్ట్ అయి శ్రీప్రియపై అరిచేశాడు. ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. చాలా మంది ఈ రెండు వారాల్లో శ్రీ ప్రియా పెర్ఫామెన్స్ ఇంప్రూవ్ అయింది కానీ జెస్సీ అలాగే ఉన్నాడు అని తెలిపారు. 

Latest Videos

click me!