కృతి సనన్ కొత్త ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవుతారు.. అయ్యో ఎంత పేదరాలు !

Published : Feb 27, 2025, 06:27 PM IST

కృతి సనన్ బాంద్రాలోని సంధు ప్యాలెస్‌కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ కేఎల్ రాహుల్, జావేద్ జాఫ్రీ కూడా ఉంటారు. దీని కోసం ఆమె నెలకు చెల్లిస్తున్న రెంటో ఏంటో తెలిస్తే మతిపోవాల్సిందే. 

PREV
19
కృతి సనన్ కొత్త ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవుతారు.. అయ్యో  ఎంత పేదరాలు !

బాలీవుడ్ నటి కృతి సనన్ ముంబైలో అద్దె ఇంట్లో ఉంటోంది. ఇటీవలే ఆమె కొత్త ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అయ్యింది. మరి ఈ కొత్త ఇంటి అద్దె తెలిస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే. 

29

ముంబైలో కృతి సనన్ తన ఇల్లు మార్చిందని ఒక `పేపరాజీ` పేజీ ద్వారా తెలిసింది. దీంతో ఎందుకు కృతి సనన్‌ ఇళ్లు మారిందనేది ఆసక్తికరంగా మారింది. 

39

కృతి ఇంతకు ముందు ఓషివారాలోని అట్లాంటిస్ అనే బిల్డింగ్‌లో ఉండేదని చెబుతున్నారు. చాలా కాలంగా ఆమె అక్కడే ఉంటుందట. కానీ సడెన్‌గా ఇప్పుడు షిఫ్ట్ అయ్యింది. సెలబ్రిటీలు ఉండే ప్లేస్‌కి ఆమె ఇళ్లు మారినట్టు తెలుస్తుంది. 

49

ఇప్పుడు కృతి తన అడ్రస్ మార్చేసింది. బాంద్రాలోని ఫేమస్ బిల్డింగ్ సంధు ప్యాలెస్‌కి షిఫ్ట్ అయింది. అయితే ఈ కొత్త ఇళ్లు రెంట్‌ వివరాలు తెలిస్తే మతిపోతుంది. ఇంత కాస్ట్లీ ఇంట్లోకి కృతి ఎందుకు షిఫ్ట్ అయినట్టు అనేది ఆసక్తికరంగా మారింది. 

59

మన ఇండియన్‌ క్రికెటర్స్  కేఎల్ రాహుల్, జావేద్ జాఫ్రీ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. వారి ఇళ్లకి సమీపంలోనే ఇప్పుడు కొత్తగా మారిన కృతి సనన్‌ ఇళ్లు కూడా ఉంటుందని సమాచారం. 

69

కృతి ఈ ఫ్లాట్‌ను లీజుకు తీసుకుందని అంటున్నారు. దీని కోసం ఆమె నెలకు 16-17 లక్షలు అద్దె చెల్లిస్తుంది. పెళ్లి చేసుకోకుండా ఇంకా బ్యాచ్‌లర్‌గానే ఉంటున్న కృతి ఇంత కాస్ట్లీ ఫ్లాట్‌కి మారడం ఆశ్చర్యపరుస్తుంది. పైగా ఆమె నెలకు చెల్లిస్తున్న రెంటే మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 

79

కృతి ఫ్లాట్ అద్దె గురించి తెలుసుకున్న ఇంటర్నెట్ యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమదైన స్టయిల్‌లో కామెంట్లు పెడుతున్నారు. ఇండైరెక్ట్ గా ఆమెని ట్రోల్‌ చేస్తున్నారు. 

89

ఒక ఇంటర్నెట్ యూజర్ సరదాగా కామెంట్ చేస్తూ "పాపం ఎంత పేదరాలు. అద్దెకు ఉంటోంది" అని రాశారు.ఖరీదైన రెంటర్‌ అని, వామ్మో రెంట్లకి ఇన్ని లక్షలు తగలబెడుతున్నారా? అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. 

99

కృతి సనన్ చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'దో పత్తి'లో కనిపించింది. అంతకు ముందు ప్రభాస్‌ సరసన `ఆదిపురుష్‌` సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇది ఆడలేదు. అయితే ఇటీవల కృతి లవ్‌లో పడిందట. నటుడు కబీర్‌ బహియాతో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే. 

read  more: ముక్కుతో టమాటాలు కోసిన ప్రభాస్‌, మోహన్‌బాబు కంటే ఆయనదే షార్ప్.. వీడియో వైరల్‌

also read: చిరంజీవితో రాజమౌళి సినిమా చేస్తే మనశ్శాంతి ఉండదు, విజయేంద్రప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు.. అడ్డుపడింది అతనేనా?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories