చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి చుక్కలు చూపించిన జూ.ఎన్టీఆర్, ఏకంగా సచిన్ తో పోలిక

Published : Feb 27, 2025, 06:19 PM IST

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఉన్న హీరో. ఒక కొత్త దర్శకుడు చిరంజీవితో ఎవరూ ఊహించని విధంగా ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నారు. 

PREV
15
చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి చుక్కలు చూపించిన జూ.ఎన్టీఆర్, ఏకంగా సచిన్ తో పోలిక
Jr NTR, Chiranjeevi, Sachin Tendulkar

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఉన్న హీరో. ఒక కొత్త దర్శకుడు చిరంజీవితో ఎవరూ ఊహించని విధంగా ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు గుణశేఖర్. ఆయన ప్రతిభ గురించి ఎవరికీ అనుమానం అక్కర్లేదు. 

 

25
Gunasekhar

చిరంజీవితో ఇండస్ట్రీ హిట్ 

భారీ సెట్టింగులను గుణశేఖర్ పెట్టింది పేరు. అలాంటి డైరెక్టర్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చుక్కలు చూపించారట. జూనియర్ ఎన్టీఆర్ తో గుణశేఖర్ రామాయణం చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అది చిన్న పిల్లల రామాయణం. జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. అప్పటికి గుణశేఖర్ కి రెండు మూడు చిత్రాల అనుభవం మాత్రమే ఉంది. ఆ వెంటనే చిరంజీవితో చూడాలని ఉంది చిత్రం తెరకెక్కించారు. 

35

మహేష్ బాబుకి మాస్ ఇమేజ్ 

గుణశేఖర్ దర్శకత్వం, మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఫలితంగా మెగాస్టార్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పడింది. సూపర్ స్టార్ మహేష్ బాబుని మాస్ హీరోగా మార్చింది కూడా గుణశేఖర్ అనే చెప్పొచ్చు. అప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన మహేష్ కి ఒక్కడు చిత్రం మాస్ ఇమేజ్ తీసుకువచ్చింది. సంచలన విజయంగా నిలిచింది. 

45

అలాంటి గుణశేఖర్ కి కూడా జూనియర్ ఎన్టీఆర్ చుక్కలు చూపించారట. రామాయణం చిత్రంలో రాముడిగా తారక్ ని గుణశేఖర్ ఎంపిక చేశారు. ఒక రోజు షూటింగ్ లో ఎన్టీఆర్ అల్లరి ఎక్కువ కావడంతో గుణశేఖర్ మందలించారట. దీనితో తారక్ అలిగి ఇంటికి వెళ్ళిపోయాడు. గుణశేఖర్ వెళ్లి తారక్ ని బుజ్జగించి తీసుకురావాల్సి వచ్చింది. అంతలా ఎన్టీఆర్ అల్లరి ఉండేది. కానీ జూనియర్ ఎన్టీఆర్ లో పొటెన్షియల్ ని అప్పుడే గుర్తించినట్లు గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

 

55

జూనియర్ ఎన్టీఆర్ కి సచిన్ తో పోలిక 

జూనియర్ ఎన్టీఆర్ ని ఏకంగా సచిన్ టెండూల్కర్ తో గుణశేఖర్ పోల్చారు. సచిన్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని వండర్ కిడ్ అని పొగిడిగేవాళ్ళు. ఎందుకంటే సచిన్ లోని పొటెన్షియల్ అప్పుడే కనిపించింది. అంతా ఆశించినట్లుగానే సచిన్ క్రికెట్ లో ఎక్కడికో వెళ్లిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ని కూడా చిన్నతనంలో చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. తారక్ వండర్ కిడ్ అని అనుకున్నా అని గుణశేఖర్ తెలిపారు. చిన్నతనం లోనే తారక్ కి కూచిపూడి, భరతనాట్యంపై అద్భుతమైన గ్రిప్ ఉండేది అని గుణశేఖర్ తెలిపారు. ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories