దారుణమైన తిట్లు అవి, కన్నీళ్లొచ్చాయి.. కృతీ సనన్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..

Published : Sep 06, 2023, 07:28 AM IST

ఎంత పెద్ద స్టార్ అయినా.. కెరీర్ లో ఇబ్బందులుతప్పవు. ఏదో ఒక టైమ్ లో అవమానాలు  పడకతప్పదు. అటువంటి అవమానాన్ని గుర్తు చేసుకుని ఎమోనల్ అయ్యింది స్టార్ హీరోయిన్ కృతీ సనన్. 

PREV
16
దారుణమైన తిట్లు అవి, కన్నీళ్లొచ్చాయి.. కృతీ సనన్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ లోకెరీర్ స్టార్ట్ చేసి..  బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది కృతీ సనన్.  బీ టౌన్ లో .. సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తోంది బ్యూటీ. రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది బ్యూటీ.. అయితే తాను ఈస్టేజ్ కు రావడం అంత ఈజీగా జరగలేదు అంటోంది కృతీ సనన్. ఎన్నో అవమానాలు ఫేస్ చేసుకుంటూ.. ఇక్కడి వరకూ వచ్చానంటోంది బ్యూటీ. 
 

26

రీసెంట్ గా ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ ను సాధించింది కృతీ సనన్. ఆలియా భట్ తో పాటు. కృతీ సనన్ ఈ అవార్డ్ ను పంచుకోబోతోంది. ఇక నటీనటుల లైఫ్‌లోనూ ఎన్నో కష్టాలు ఉంటాయని చెప్పుకొచ్చింది  కృతి సనన్. ఏదిగే క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయని చెప్పింది. కెరీర్‌ మొదట్లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో  పంచుకుంది బ్యూటీ. 
 

36

కృతీ సనన్ మాట్లాడుతూ... నేను ముంబైకి వచ్చిన కొత్తలో  జరిగిన సంఘటన నా జీవితంలో మర్చిపోలేను..  అప్పట్లో మోడలింగ్ చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేదాన్ని. నా అదృష్టం కొద్దీ ఒకేసారి వన్ నేనొక్కడినే, హీరోపంతీ అనే రెండు సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది.  దాంతో నా సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి అన్నారు. 
 

46
Kriti Sanon

ఇక  అప్పటికి ఈ సినిమాల షూటింగ్ స్టార్ట్ కాలేదు.. మరికొద్ది రోజుల్లో  షూటింగ్ స్టార్ట్  అవుతుంది అనుకుంటుండగా.. ఓ మోడలింగ్ షోలో పాల్లొనే అవకాశం వచ్చింది. ఆ ర్యాంప్ షోలో పాల్గొనేందుకు వెళ్లా.  అయితే అది స్టేజ్ మీద కాదు.. పచ్చికలా ఉన్న లాన్‌లో క్యాట్ వాక్ చేస్తున్నా.ఉన్నట్టుండి నేను వేసుకున్న హీల్స్ మడమలు నేలలోకి దిగబడిపోయాయి. 
 

56

అలా నేలలో దిగబడిపోవడతో.. గందరగోళానికి లోనైన నేను మధ్యలోనే ఆగిపోవడంతో.. ఆ షోకి కొరియోగ్రఫీ చేసిన ఆవిడ వెంటనే గట్టిగా అరుస్తూ.. పిచ్చి పిచ్చిగా తిట్టేసింది. దాదాపు యాభై మంది మోడళ్ల ముందు నన్ను దారుణంగా అవమానించింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ పక్కకి వెళ్లి చాలాసేపు ఏడ్చాను అంటూ ఎమోషనల్ అయ్యారు. 

66

ఆ తరువాత మళ్లీ ఆమెతో కలిసి పనిచేయలేదు అంటూ ఆనాటి చేదు అనుభవం గుర్తు చేసుకుంది కృతీ సనన్. ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న కృతీ.. మహేష్ వన్ నేనొక్కడినే తరువాత టాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేసింది. అయితే ఇక్కడ పెద్దగా  ఆఫర్లు.. హిట్లు లేక.. బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ఆదిపురుష్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. 

click me!

Recommended Stories