లేత గులాబీ చీరలో కృతి సనన్ మెరుపులు.. చురకత్తి చూపులతో మైమరిపిస్తున్న ‘ఆదిపురుష్’ బ్యూటీ..

First Published | Oct 22, 2023, 9:36 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)  ఫెస్టివల్ ట్రీట్ అందించింది. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చి  కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. చీరకట్టులో యంగ్ బ్యూటీ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. 
 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా ‘గణపథ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చివరిగా ‘ఆదిపురుష్’తో అలరించింది. సీత పాత్రలో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఆమెకు మంచి క్రేజ్ దక్కింది.
 

లేటెస్ట్ ఫిల్మ్ Ganapathతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. యాక్షన్ హీరో టైగర్ ఫ్రాష్ సరసన నటించింది. చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ నెట్టింట సందడి చేస్తూనే ఉంది. వరుసగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. 


తాజాగా బాలీవుడ్ బ్యూటీ సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. చీరకట్టులో దర్శనమిచ్చి  మరింత బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. లేత గులాబీ రంగు చీరలో పద్ధతిగా తయారై మంత్రముగ్ధులను చేసింది. మ్యాచింగ్ బ్లౌజ్, జ్యూయెల్లరీ ధరించి మరింత అందాన్ని సొంతం చేసుకుంది.
 

బ్యూటీఫుల్ లుక్ లో కృతి సనన్ మతిపోయేలా ఫోటోషూట్ చేసింది. మెస్మరైజ్ చేసేలా ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది. పండగవేళ కృతి ఇంత అందంగా, పద్ధతిగా దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు కూడా ఆమె ఫొటోలకు ఖుషీ అవుతున్నారు. 
 

కృతి తన కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తోంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ‘వన్ నేనొక్కడినే’, ‘దోచేయ్’ వంటి సినిమాలు చేసింది. ‘ఆదిపురుష్’తో మంచి అవకాశం అందినా.. ఆ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

ప్రస్తుతం ‘గణపథ్’తో థియేటర్లలో సందడి చేస్తోంది. యాక్షన్ పెర్ఫామెన్స్ తో తన అభిమానులను ఫుల్ ఫిదా చేస్తోంది. ప్రస్తుతం మరో రెండు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాయి. అలాగే ఇంకో చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. తనే నిర్మాతగా రూపుదిద్దుకుంటోంది. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ తో కృతి సనన్ బిజీగా ఉంది. 
 

Latest Videos

click me!