పద్ధతిగా రెడీ అయ్యి ముద్దుగా ఫోజులిచ్చిన హన్సికా.. యాపిల్ బ్యూటీ క్యూట్ లుక్స్..

First Published | Oct 22, 2023, 7:30 PM IST

స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ ప్రత్యేకమైన రోజుల్లో సంప్రదాయ దుస్తుల్లో మెుస్తుంటుంది. ఈరోజు పండగవేళ కావడంతో యాపిల్ బ్యూటీ ట్రెడిషనల్ వేర్ లో క్యూట్ గా దర్శనమిచ్చింది. లేటెస్ట్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు వెలుగొందిన స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani) ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. తెలుగు, తమిళంలో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. విభిన్న పాత్రలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.
 

అయితే, గతేడాది డిసెంబర్ 4న హన్సికా మోత్వానీ పెళ్లి ఘనంగా జరిగింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను యాపిల్ బ్యూటీ పెళ్లి చేసుకుంది. కొద్దినెలలు మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేసింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. 


పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం ఐదారు చిత్రాల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ను జోరుగా నడిపిస్తోంది. ఇదిలా ఉంటే... సోషల్ మీడియాలోనూ హన్సికా తెగ సందడి చేస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తూ ఆకట్టుకుంటోంది. 
 

అలాగే తన క్యూట్ ఫొటోలనూ షేర్ చేసుకుంటూ మంత్రముగ్దులను చేస్తోంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో  హన్సికా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ కట్టిపడేస్తోంది. ఈరోజు పండుగ వేళ అవడంతో ట్రెడిషనల్ వేర్స్ లో దర్శనమిచ్చింది. తన అభిమానులను ఫిదా చేసింది. 
 

వైట్ చుడీదార్ లో యాపిల్ బ్యూటీ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెడిషనల్ వేర్ లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చైర్ పై పద్ధతిగా కూర్చొని క్యూట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. తన చిలిపిదనంతో ఆకర్షించింది. తాజాగా షేర్ చేసిన పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. 
 

హన్సికా తన సినిమాల పట్ల అప్డేట్స్ ఇస్తూనే..  ఇలా రీల్స్, గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది. కెరీర్ విషయానికొస్తే..  హన్సికా ప్రస్తుతం 
తెలుగులో 105 మినిట్స్, మై నేమ్ ఇజ్ శృతి, తమిళంలో రౌడీ బేబీ, గార్డియన్, గాంధరి, మ్యాన్ వంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 
 

Latest Videos

click me!