కశ్మీర్ యాపిల్ లా మెరిసిపోతున్న బేబమ్మ.. టైట్ ఫిట్ లో కృతిశెట్టి గ్లామర్ ట్రీట్.. హీటెక్కిస్తోందిగా..

First Published | Sep 20, 2023, 8:03 PM IST

‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రూటు మార్చింది. నెట్టింట వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ మంటలు పుట్టిస్తోంది. డోస్ పెంచుతూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా పంచుకున్నఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty)  టాలీవుడ్ హ్యాట్రిక్ బ్యూటీ గా ముద్ర వేసుకుంది. ఎంట్రీతోనే వరుస హిట్లతో దుమ్ములేపించింది. లక్కీ హీరోయిన్ గా కొన్నాళ్ల పాట తెలుగు పరిశ్రమలో వెలుగొందింది. 

‘ఉప్పెన’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలతో మొదటి హ్యాట్రిక్ అందుకుంది. కానీ ఆవెంటనే ఈ ముద్దుగుమ్మకు హ్యాట్రిక్ డిజాస్టర్లు తాకడం గమనార్హం. దాంతో నెమ్మదిగా కృతి శెట్టి జోరుకు బ్రేకులు పడుతూ వచ్చాయి. 
 


‘ది వారియర్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచెర్ల నియోజకవర్గం’ చిత్రాలతో డిజార్లు అందుకుంది. చివరిగా నాగచైతన్యతో వచ్చిన ‘కస్టడీ’ సైతం ఆశించిన మేర ఫలితానివ్వలేదు. దీంతో టాలీవుడ్ లో మొత్తానికే ప్రాజెక్ట్ అందడం లేదు. పైగా సూర్యతోనూ ఓ ప్రాజెక్ట్ ఓకే అయ్యి ఆగిపోయింది.
 

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం కృతి శెట్టి అందాల విందు చేస్తోంది. ఓవైపు కెరీర్ స్లో అవుతున్న తరుణంలో గ్లామర్ మెరుపులతో నెట్టింట దుమ్ములేపుతోంది. మరిన్ని ప్రాజెక్ట్స్ ను చేజిక్కించుకునేందుకు గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. రెడ్ అవుట్ ఫిట్ లో కృతిశెట్టి అందాల విందు చేసింది. కశ్మీర్ యాపిల్ లా నిగనిగలాడుతున్న బేబమ్మ చూడగానే కుర్ర హృదయాలను దోచేలా మెరిసింది. 
 

గ్లామర్ డిగ్రీ పెంచుతూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందాలతో అదరహో అనిపిస్తోంది. మత్తు ఫోజులు, మైమరిపించే లుక్స్ లో యువతను చిత్తు చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా మారాయి. 
 

డీప్ బ్యాక్, షోల్డర్ అందాలను చూపిస్తూ బేబమ్మ మైమరిపించింది.  మెరిసిపోయే చర్మసౌందర్యం, ఊరించే పెదాలు, నిషా కళ్లతో నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేసింది. మత్తుగా ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. 

టాలీవుడ్ లో కృతి జోరు తగ్గడంతో, తమిళం, మలయాళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం మలయాళంలో ‘అజాయంతే రందం మోషణం’, ‘జీనీ’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. 
 

Latest Videos

click me!