`ఉప్పెన`తో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌.. రెమ్యూనరేషన్‌ పెంచేసి షాకిస్తున్న కృతిశెట్టి

Published : Feb 28, 2021, 07:59 AM IST

`ఉప్పెన` సినిమాతో ఉప్పెనలా దూసుకొచ్చింది కృతి శెట్టి. తొలి చిత్రంతోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌ పాపులారిటీని సొంతం చేసుకుంది. అత్యంత క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ భామ హాట్‌ ఫేవరేట్‌. దీంతో రెచ్చిపోతుంది కృతి శెట్టి. రెమ్యూనరేషన్‌ అమాంతం పెంచేసింది. టాలీవుడ్‌ వర్గాలకు షాక్‌ ఇస్తుంది.   

PREV
18
`ఉప్పెన`తో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌.. రెమ్యూనరేషన్‌ పెంచేసి షాకిస్తున్న కృతిశెట్టి
కన్నడ భామ కృతి శెట్టి ఎలాంటి యాక్టింగ్‌ కోర్స్ చేయకుండానే డైరెక్ట్ గా సినిమాల్లోకి వచ్చేసింది. సినిమాల్లోకి రావాలని కలలు కూడా కనలేదు. కానీ అదృష్టం ఆమె తలుపు తట్టింది.

28
`ఉప్పెన` సినిమాల్లో నటించే అరుదైన అవకాశం దక్కింది. తొలి సినిమాతోనే మెగా స్టార్‌ మేనల్లుడుతో కలిసి నటించడం, ఓ పెద్ద బ్యానర్‌లో సినిమా కావడం నిజంగానే కృతి నక్క తోక తొక్కిందనే చెప్పాలి.

38
బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతూ, వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతూ, కృతి శెట్టి హీరోయిన్‌గా పరిచయం అయి చేసిన `ఉప్పెన` ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదలై సంచలన విజయం సాధించింది.

48
ఈ సినిమా దాదాపు అరవై కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. ఓ కొత్త హీరోకి ఈ రేంజ్‌ కలెక్షన్లు రావడం టాలీవుడ్‌ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్‌. ఇందులో బేబమ్మ పాత్రలో నటించిన కృతి శెట్టికి మంచి పేరొచ్చింది. అద్భుతమైన హవభావాలతో సినీ వర్గాలనే కాదు, ఆడియెన్స్ ని ఫిదా చేసిందీ బ్యూటీ. ఇక ఆమె సహజమైన అందం బోనస్‌ అనే చెప్పాలి.

58
అందానికి, అద్భుతమైన అభినయం తోడైతే అది కృతి శెట్టిలానే ఉంటుందనే కొత్త నిర్వచనం తీసుకొచ్చిందీ క్యూబ్‌ బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడి కోసం స్టార్‌ హీరోలు సైతం వెంటపడుతున్నారు. తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవాలని ఆరాటపడుతున్నారంటే ఈ అమ్మడి క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకోవచ్చు.

68
అయితే `ఉప్పెన` సినిమాకి కృతికి రూ.25లక్షలు రెమ్యూనరేషన్‌గా ఇచ్చారట. దీంతోపాటు ఇతర గిఫ్ట్స్ అదనం. తొలి సినిమాతోనే ఈ రేంజ్‌లో పారితోషికం అందుకోవడం ఓ విశేషమైతే, తన నెక్ట్స్ సినిమాతోనే రెమ్యూనరేషన్‌ పెంచేసినట్టు తెలుస్తుంది.

78
ఇప్పుడు ఈ అమ్మడు రూ.కోటీ డిమాండ్‌ చేస్తుందట. జనరల్‌గా ఓ హీరోయిన్‌ కోటి రూపాయల పారితోషికం చేరుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. చాలా హిట్స్ రావాలి. పెద్ద హీరోలతో సినిమాలు చేయాలి. కానీ కృతికి రెండో సినిమాతోనే ఇంత రేంజ్‌లో డిమాండ్‌ రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

88
ప్రస్తుతం కృతి.. నానితో `శ్యామ్‌సింగరాయ్‌` చిత్రంలో, అలాగే సుధీర్‌బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌ చిత్రంలో నటిస్తుంది. మరికొన్ని ఆఫర్లు ఈ బ్యూటీని వెంటాడుతున్నాయి. అందుకు తగ్గట్టే కృతి రెమ్యూనరేషన్‌ పెంచుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కృతి పారితోషికం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories