బేబమ్మని వెంటాడుతున్న బ్యాడ్‌ లక్‌.. కృతి శెట్టికి మరో డిజాస్టర్‌ తప్పదా?

Published : May 12, 2023, 09:30 PM ISTUpdated : May 12, 2023, 11:03 PM IST

బేబమ్మగా తెలుగు తెరకి పరిచయం అయ్యింది కృతి శెట్టి. ఆమె `ఉప్పెన` సినిమాతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గానూ మారింది. ఇక ఆ సినిమా హిట్‌తో హాట్‌ కేక్‌లా మారిపోయింది. 

PREV
15
బేబమ్మని వెంటాడుతున్న బ్యాడ్‌ లక్‌..  కృతి శెట్టికి మరో డిజాస్టర్‌ తప్పదా?

రెండేళ్ల క్రితం కృతి శెట్టి అంటే టాలీవుడ్‌లో ఓ హాట్‌ కేక్‌. ఆమె కోసం స్టార్‌ హీరోలంతా ఎగబడ్డారు. `ఉప్పెన` తో వచ్చిన సంచలన విజయంతో కృతి శెట్టి ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. అందం, అభినయం ఆమె సోంతం కావడంతో ఆ అవకాశాల జోరు పెరిగింది. దీంతో వెంటనే వచ్చిన ఆఫర్లన్నీ ఓకే చెప్పింది కృతి. యంగ్‌ హీరోలందరితోనూ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఆమె కంటెంట్‌నిగానీ, తన పాత్రలకు ప్రయారిటీని కానీ పట్టించుకోలేదు. 

25

సక్సెస్‌ తో వచ్చిన ఆనందంలో వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్లింది. నానితో `శ్యామ్‌ సింగరాయ్‌`, నాగచైతన్యతో `బంగార్రాజు`, రామ్‌తో `ది వారియర్స్`, నితిన్‌తో `మాచర్ల నియోజకవర్గం`, సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాల్లో నటించింది కృతి శెట్టి. ఇందులో `శ్యామ్‌ సింగరాయ్‌`, `బంగార్రాజు` ఫర్వాలేదు. యావరేజ్‌ చిత్రాలుగా నిలిచాయి. కానీ ఆ తర్వాత `ది వారియర్స్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` వంటి చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్‌ డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ఎంత స్పీడ్‌గా ఎదిగిందో, క్రేజ్‌ని, పాపులారిటీని తెచ్చుకుందో, అదంతా ఒక్కసారిగా పడిపోయింది. 

35

కృతి శెట్టి జోరు ఇప్పుడు దారుణంగా పడిపోయింది. ఆమె రెగ్యూలర్‌ హీరోయిన్‌గా మారిపోయింది. గ్లామర్‌ సైడ్‌ కూడా ఓపెన్‌ అవుతుంది. అవకాశాల కోసం అందాల డోస్ పెంచుతూ ఫోటో షూట్లు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఎంతో నమ్మకంతో మరోసారి నాగచైతన్యతో కలిసి `కస్టడీ` చిత్రంలో నటించింది. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు రూపొందించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేడు శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకి తొలి ఆట నుంచి నెగటివ్‌ టాక్‌ వస్తుంది. రొటీన్‌ మూవీగా, కథలో విషయం లేదనే కామెంట్లు వస్తున్నాయి. చిన్న లైన్‌ ని సాగదీశాడని, మళ్లీ యాక్షన్‌ సీన్లు కూడా చాలా వరకు సహజంగా పెట్టే ప్రయత్నం చేసినా, వాహ్‌ అనిపించేలా లేవు. `విక్రమ్‌`, `ఖైదీ` తాలుకూ స్క్రీన్‌ప్లే బోర్‌ తెప్పిస్తుంది. దీంతో ఈ చిత్రం ఫ్లాప్‌ జాబితాలో చేరుతుందని అంటున్నారు క్రిటిక్స్. ఆడియెన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. 

45

ఇందులో కృతి శెట్టి పాత్రకి పెద్దగా స్కోప్‌ లేదు. గ్లామర్‌ పరంగానూ స్కోప్‌ లేదు. ఆమె పాత్ర బలవంతంగా ఇరికించినట్టుగానే ఉంటుంది. పైగా కథ ఫ్లోకి అడ్డుగానే ఉంటుంది. సో మొత్తంగా ఈ సినిమాతో కృతిశెట్టికి మరో పరాజయం తప్పేలా లేదు. దీంతో నెటిజన్లు దీనిపై స్పందిస్తూ, బ్యాడ్‌ లక్‌ కృతిని వెంటాడుతుందని, మరో ఫ్లాప్‌ మూటగట్టుకుంటుందని, హాట్‌ సెన్సేషన్‌ కాస్త ఐరన్‌ లెగ్‌లా మారుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే `కస్టడీ` టీమ్‌తోపాటు కృతి కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. కచ్చితంగా హిట్‌ అవుతుంది, పెద్ద రేంజ్‌ మూవీ అవుతుందని అనుకున్నారు. కానీ రిజల్ట్ చూస్తుంటే తేడా కొడుతుంది. కనీసం మార్నింగ్‌ ఓపెనింగ్స్ కూడా లేకపోవడం అత్యంత విచారకరం. 

55

మరి నెగటివ్‌ టాక్‌ని దాటుకుని సినిమా ఆడుతుందా? లేక బలవుతుందా? అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది. ఇక కృతి చేతిలో ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. తమిళంలో సూర్యతో బాలా సినిమాలో నటించాల్సి ఉంది. కానీ దాన్నుంచి తప్పుకుంది. ఇప్పుడు కృతి కాల్షీట్లు ఎంప్టీగా మారుతున్నాయి. ఇది ఆమెకి కాస్త సవాళ్లతో కూడిన సమయంగానే చెప్పొచ్చు. దీన్ని ఎలా ఫేస్‌ చేస్తుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories