డైరెక్టర్ తో ఆ ఒక్క విషయంలో బాగా ఇబ్బంది పడ్డాను : కృతి శెట్టి

Published : Jul 11, 2022, 09:50 AM IST

వరుసగా సినిమా ఆఫర్లు.. వరుస విజయాలతో దూసుకుపోతోంది కృతి శెట్టి.  ఇక ప్రస్తుతం ది వారియర్ సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్న బ్యూటీ.. ఈ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు పంచుకుంది.   

PREV
17
డైరెక్టర్ తో ఆ ఒక్క విషయంలో బాగా ఇబ్బంది పడ్డాను : కృతి శెట్టి

అంతా బాగానే ఉంది కాని.. ఆ ఒక్క విషయంలోనే ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటోంది కృతి శెట్టి. ది వారియర్ మూవీ విశేషాలు ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న బ్యూటీ.. డైరెక్టర్ లింగు స్వామి విషయంలో కాస్త ఇబ్బంది తప్పలేదు అంటోంది. 

27

టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన టైమ్ గట్టిగా ఉన్నట్టుంది.. వచ్చిన  దగ్గర నుంచి కృతి శెట్టి చేసిన ప్రతి సినిమా హిట్టే. ఇప్పటికే కృతి  బ్యూటీ హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఆ తరువాత కూడా వరుసగా హిట్లు కొట్టాలని కసితో ఉంది. ఇక  కృతి శెట్టి నాలుగో సినిమాగా వస్తుంది ది వారియర్.

37

ఈ నెల 14న రిలీజ్ కు రెడీ అవుతోంద ది వారియర్. ఇక ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు రామ్ - కృతి శెట్టి ఇద్దరూ. నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గాసెలబ్రేట్ చేశారు. ఇక వరుసగా ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.  

47

 తమిళ సీనియర్ డైరెక్టర్  లింగుసామి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్ లో ఒకే ఒక విషయంలో ఇబ్బందిపడ్డానంటోంది. 

57

కృతి శెట్టి మాట్లాడుతూ ..నా మాతృభాష 'తుళు అయితే.. తెలుగు నేను బాగానే మాట్లాడతాను. ఇంత వరకూ నేను పనిచేసిన దర్శకులు అంతా  తెలుగు బాగా తెలిసిన వారే. కాబట్టి ఇబ్బంది రాలేదు. కాని  లింగుసామిగారి తెలుగులో తమిళ యాస ఉంటుంది. నాకు తమిళం రాదు కాట్టి... ఆయన మాట్లాడే తెలుగు అర్థం అయ్యేది కాదు అన్నారు కృతి. 

67

షూటింగ్ స్టార్ట్ అయిన ఒక వారం రోజుల పాటు అలా ఇబ్బంది పడ్డాను. కాని  రామ్ కి తమిళం కూడా బాగా వచ్చు. అందు వలన ఆతరువాత నుంచి ఆయన సపోర్ట్ తీసుకున్నాను. లింగుసామి గారు ఏం చెబుతున్నారనేది నాకు రామ్ గారు చెప్పేవారు. ఆ తరువాత నేను అలవాటు పడిపోయాను అన్నారు. 
 

77

ఇక  ఈ సినిమాలో కృతి శెట్టి  రేడియో జాకీగా కనిపించబోతోంది. ఈ సినిమాలో తన పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది బేబమ్మ. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి ఖాతాలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ప్రపోజల్ స్టేజ్ లో ఉన్నాయి. 

click me!

Recommended Stories