కృష్ణుడు మాట్లాడుతూ, ఈ సీజన్‌లో బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్ అయ్యే ఛాన్స్ త్రిగుణ్‌కి ఉందని చెప్పాడు. తన ఆటతీరు, తన అగ్రెషన్, ప్రవర్తన అన్నీ చూస్తే త్రిగుణ్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రిడిక్షన్ ఇచ్చాడు కృష్ణుడు. ఇక బిగ్ బాస్‌లో తనలోని మరో యాంగిల్‌ని చూపించాలనుకున్నాడట. వినాయకుడు సినిమాతో అంతా అమాయకుడు అనుకుంటున్నారని, తనలో ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి, ఫన్ యాంగిల్ కూడా ఉందని, ఫ్యామిలీ యాంగిల్ కూడా ఉందని ఇవన్నీ చూపించాలనుకున్నాను, కానీ అనుకోకుండా ఎలిమినేట్ అయ్యానని తెలిపారు. ఎలిమినేట్ కావడం పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, తన తప్పిదం వల్లే ఎలిమినేట్ అయినట్టు చెప్పారు. ఫుడ్ విషయంలో, స్వీట్స్ విషయంలో ఇబ్బంది పడ్డానని, దీని కారణంగా హెడెక్ వచ్చేదని, ఆటపై ఫోకస్ పెట్టలేకపోయానని తెలిపారు.