రెబల్ స్టార్ కృష్ణం రాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య అనుబంధాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. తన పెదనాన్న అంటే ప్రభాస్ ఎంత ప్రేమిస్తాడో.. అదే విధంగా ప్రభాస్ విషయంలో కృష్ణం రాజు కేర్ తీసుకుంటారు. కృష్ణం రాజు గత ఏడాది సెప్టెంబర్ లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగినప్పుడు కృష్ణంరాజు ఎంతో పొంగిపోయారు. ప్రభాస్ లో తనని చూసుకుంటూ మురిసిపోయారు.