కృష్ణ, కృష్ణంరాజు స్నేహంపై శ్యామలాదేవి కామెంట్స్.. అండమాన్ లో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ..

Published : Nov 16, 2022, 04:11 PM IST

సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి నివాళులు అర్పించారు. అనంతరం శ్యామలాదేవి మీడియాతో మాట్లాడుతూ కృష్ణ, కృష్ణంరాజు మధ్య స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. 

PREV
16
కృష్ణ, కృష్ణంరాజు స్నేహంపై శ్యామలాదేవి కామెంట్స్.. అండమాన్ లో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ..

సిల్వర్ స్క్రీన్ పై సాహసాలు అంటే గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన మృతితో టాలీవుడ్ లో ఒక శకం ముగిసినట్లు అయింది. మంగళవారం రోజు సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. నేడు వెలది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య కృష్ణ అంత్యక్రియలు జరుగుతున్నాయి. 

26

సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి నివాళులు అర్పించారు. అనంతరం శ్యామలాదేవి మీడియాతో మాట్లాడుతూ కృష్ణ, కృష్ణంరాజు మధ్య స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులు అని ఆమె అన్నారు. ఇండస్ట్రీకి కలిసే వచ్చారు.. కలిసే వెళ్లిపోవాలనుకున్నారేమో.. అందుకే ఇలా కొద్ది రోజుల గ్యాప్ లోనే ఇద్దరూ మనల్ని విడిచి వెళ్లిపోయారు. 

36
Krishna

తక్కువ వ్యవధిలో మహేష్ బాబు తన తల్లి, సోదరుడు రమేష్, ఇప్పుడు తండ్రి కృష్ణ గారికి కోల్పోవడం చాలా బాధాకరం అని శ్యామలాదేవి అన్నారు. సుల్తాన్ మూవీ షూటింగ్ సమయం నుంచి కృష్ణ గారితో నాకు పరిచయం ఉంది. ఆ మూవీ షూటింగ్ కోసం నెలరోజుల పాటు అండమాన్ దీవుల్లో ఉన్నాం. 

46

ఆ టైంలో విజయనిర్మల గారే మా అందరికి వంట చేసి పెట్టేవారు. కొన్ని నెలల క్రితం కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా కృష్ణం రాజుగారు ఫోన్ చేశారు. చేపల పులుసు వండి పెడతాను.. ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లు అని అడిగారు. వారిద్దరి మధ్య అంత మంచి స్నేహం ఉంది అని శ్యామల దేవి అన్నారు. 

56

సెప్టెంబర్ 11న కృష్ణంరాజు గారు అనారోగ్యంతో మృతి చెందారు. వీళ్లిద్దరి కీర్తి శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని శ్యామలాదేవి అన్నారు. వారిద్దరి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శ్యామలా దేవి ఎమోషనల్ అయ్యారు. 

 

66

అడవి సింహాలు, సుల్తాన్, భలే మోసగాడు, యుద్ధం, మనుషులు చేసిన దొంగలు ఇలా పలు చిత్రాల్లో కృష్ణ, కృష్ణం రాజు కలసి నటించారు. ఇక కృష్ణ మృతితో అభిమానులు, సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయారు. 

click me!

Recommended Stories