చిరంజీవి తాత బూతుల నాయుడా?.. కృష్ణంరాజుకి, చిరంజీవి ఫ్యామిలీకి ఉన్న సంబంధమేంటో తెలుసా?

Published : Jul 19, 2024, 04:05 PM IST

చిరంజీవి, కృష్ణంరాజు చెన్నైలో కలుసుకున్నారు. కానీ ఇద్దరు మధ్య ముగల్తూరులోనే అనుబంధం ఉంది. చిరంజీవి తాత గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించారు.  

PREV
16
చిరంజీవి తాత బూతుల నాయుడా?.. కృష్ణంరాజుకి, చిరంజీవి ఫ్యామిలీకి ఉన్న సంబంధమేంటో తెలుసా?

మెగాస్టార్‌ చిరంజీవి `పునాది రాళ్లు` చిత్రంతో నటుడిగా మారాడు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. కానీ ఆ తర్వాత చేసిన `ప్రాణం ఖరీదు` చిత్రం తొలుత విడుదలైంది. అప్పటికే `మనవూరి పాండవులు` సినిమాలో నటించే అవకాశం దక్కింది. అందులో కృష్ణంరాజు, మురళీమోహన్‌ హీరోలుగా నటించారు. వారిలో ఒకరిగా చిరంజీవి నటించాడు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. అందరి చూపు చిరంజీవిపై పడింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. సోలో హీరోగా ఎదిగి వరుస సినిమాలు చేశారు. ఈ క్రమంలో కొన్ని నెగటివ్‌ రోల్స్ కూడా చేశారు చిరు. 
 

26

మెగాస్టార్‌ చిరంజీవి `పునాది రాళ్లు` చిత్రంతో నటుడిగా మారాడు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. కానీ ఆ తర్వాత చేసిన `ప్రాణం ఖరీదు` చిత్రం తొలుత విడుదలైంది. అప్పటికే `మనవూరి పాండవులు` సినిమాలో నటించే అవకాశం దక్కింది. అందులో కృష్ణంరాజు, మురళీమోహన్‌ హీరోలుగా నటించారు. వారిలో ఒకరిగా చిరంజీవి నటించాడు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. అందరి చూపు చిరంజీవిపై పడింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. సోలో హీరోగా ఎదిగి వరుస సినిమాలు చేశారు. ఈ క్రమంలో కొన్ని నెగటివ్‌ రోల్స్ కూడా చేశారు చిరు. 
 

36

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు అప్పటికే హీరోగా ఎస్టాబ్లిష్‌ అయ్యాడు. ఆల్మోస్ట్ స్టార్ ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. తొలుత తెలుగు చిత్ర పరిశ్రమ అంతా చెన్నైలోనే ఉన్న విషయం తెలిసిందే. కృష్ణంరాజు వెళ్లాక ఏడెమిదేళ్ల తర్వాత చిరంజీవి వెళ్లారు. `మనవూరి పాండవులు` చిత్రంలో కలిసి నటించారు. అప్పుడు ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అంతేకాదు తామ నేపథ్యాలను తెలుసుకున్నారు. 
 

46

కృష్ణంరాజుది, చిరంజీవిది ఒకే ఊరు అని అప్పుడే తెలిసింది. ఇద్దరిది మొగల్తూరు అనే విషయం తెలిసిందే. సినిమాల్లోకి రావడానికి ముందు చిరంజీవి తనకు తెలియదని చెప్పారు కృష్ణంరాజు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్‌ తాతతో ఆయనకున్న అనుబంధం తెలిపారు. చిరంజీవి ఫ్యామిలీ గురించి చెప్పారు కృష్ణంరాజు. చిరంజీవి తండ్రి పోలీస్‌ అనే విషయం తెలిసిందే. అంతేకాదు ఆయన తండ్రి(చిరంజీవి తాత) కూడా పోలీసే అట. ఆయన పోలీస్‌ ఇన్ స్పెక్టర్‌గా  పనిచేశాడట. ఆ సమయంలో కృష్ణంరాజు కూడా చిన్నగా ఉండేవాట. 
 

56

చిరంజీవి తాత నాయుడుగారు. నోరు విప్పితే బూతులు వచ్చేవాడట. చిన్నపిల్లలు నుంచి పెద్ద వాళ్లదాక అందరిని బూతులతో తిట్టేవాడట. ఎవరినైనా పలకరించాలన్నా బూతులతోనే స్టార్ట్ చేస్తాడట. దీంతో ఆయనంటే అందరికి హడల్‌ అనేలా ఉండేదని చెప్పారు రెబల్‌ స్టార్‌. దీంతో ఆయన్ని బూతుల నాయుడు అని పిలిచేవారట. అప్పట్లో ఆయన పేరు చాలా ఫేమస్‌ అని తెలిపారు. అయితే పోలీస్‌ అన్‌స్పెక్టర్‌గా ఆయన రిటైర్డ్ అయ్యాక తన మార్కెట్లోనే పిండి మర పెట్టుకునేందుకు అవకాశం కల్పించారట కృష్ణంరాజు ఫ్యామిలీ. వారిది రాజుల ఫ్యామిలీ అనే విషయం తెలిసిందే. ఆ టౌన్‌లో వీరికి మాత్రమే మార్కెట్‌ ఉండేదని, అందులో ఓ పిండిమరికి చోటు ఇచ్చామని చెప్పారు. 
 

66

అయితే ఆ సమయంలో చిరంజీవి తనకు తెలియదని, ఎప్పుడూ కలవలేదని, చదువుల కోసం దూరంగా ఉండేవాడేమో అని, కానీ తాత కోసం అక్కడికి వచ్చేవాడని చెప్పారు కృష్ణంరాజు. అక్కడ చిరు తెలియదుగానీ, చెన్నైకి వచ్చాక `మనవూరి పాండవులు` చిత్రంలో నటుడిగా ఎంపికైన తర్వాత ఆయన నేపథ్యం గురించి తెలిసిందని, ఇలా బూతుల నాయుడిగారి మనవడని తెలిసి సంతోషించానని, ఆ తర్వాత సినిమాల్లోకి తీసుకున్నామని చెప్పాడు కృష్ణంరాజు. ఓపెన్ హార్ట్ విత్‌ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించారు. బూతుల నాయుడితో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు కృష్ణంరాజు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories