మహేష్ బాబు నటించిన ఓ చిత్రంలో అతడి నేచురల్ పెర్ఫార్మెన్స్ కి కృష్ణం రాజు ఫ్యామిలీ మొత్తం ఫిదా అయ్యారు. అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అని కృష్ణం రాజు ప్రశంసలు కురిపించారు. అసలు ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.
రెబల్ స్టార్ కృష్ణం రాజు తన సినిమాలతో దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులని అలరించారు. కృష్ణం రాజు తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ప్రభాస్ స్టార్ హీరోగా ఎదిగారు. ప్రభాస్ ని అభిమానులు యంగ్ రెబల్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. కృష్ణం రాజుకి ప్రభాస్ కాకుండా మహేష్ బాబు అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. కార్యక్రమంలో తాను మహేష్ బాబుని దత్తత తీసుకోవాలి అనుకున్న విషయాన్ని ఓపెన్ గా చెప్పారు.
25
మహేష్ బాబు సినిమాకి కృష్ణంరాజు ఫిదా
మహేష్ బాబు సినిమాల గురించి కూడా ఒక సందర్భంలో కామెంట్స్ చేశారు. మహేష్ బాబు నటన తనకు చాలా నేచురల్ గా అనిపించిన మూవీ ఒకటుందని కృష్ణంరాజు అన్నారు. ఆ మూవీ మరేదో కాదు. బిజినెస్ మ్యాన్. ఆ చిత్రాన్ని తాము ఫ్యామిలీ మొత్తం కలసి చూసినట్లు కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామల దేవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
35
మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్
అందులో మహేష్ నటన చాలా నేచురల్ గా ఉంటుంది. అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్. డైరెక్టర్ రాసుకున్న కథ మహేష్ బాబుకి బాగా సెట్ అయింది. రచయిత, దర్శకుడు ఒక్కరే అయితే ఉండే అడ్వాంటేజ్ ఇదే. డైలాగులు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ రెండూ బావుంటాయి అని కృష్ణంరాజు అన్నారు.
అయితే ఇది కంప్లీట్ హీరో, దర్శకుడి మూవీ. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేదు. ఇప్పుడు హీరోయిన్లకు నటించడానికి స్కోప్ ఉండడం లేదు. కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితం అవుతున్నారు అని కృష్ణం రాజు అన్నారు.
55
మహేష్, పూరి జగన్నాధ్ కాంబినేషన్
పోకిరి తర్వాత మహేష్ బాబు, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం బిజినెస్ మ్యాన్. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. వివాదంతో పాటు ఈ చిత్రం భారీ వసూళ్లు కూడా సాధించింది.