అల్లూరి సీతారామరాజుతో దేశభక్తి చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. దేశభక్తి చిత్రాల్లో కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం చిత్రానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణ వంశీ తన క్రియేటివిటీ ప్రదర్శించి అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే, కిమ్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.