korean kanakaraju Day 7 collections: వరుణ్ తేజ్ మూవీకి ఎదురుదెబ్బ, కొరియన్ కనకరాజు వారంలో ఎంత వసూలు చేసింది?

Published : Aug 14, 2026, 09:10 AM IST

korean kanakaraju collections: వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు మూవీ వారం రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర చలికిలపడింది. రిలీజ్ అయిన తొలి రోజుల్లో జోరు చూపించిన ఈసినిమా.. ఏడురోజుల్లో ఎంత సాధించిందంటే?

PREV
15
బాక్సాఫీస్ దగ్గర కష్టపడుతున్న కొరియన్ కనకరాజు..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా హారర్-కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద తన మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. విడుదలైన తొలి రోజుల్లో మంచి స్పందనను రాబట్టిన ఈ సినిమా, వర్కింగ్ డేస్ ప్రారంభమైనప్పటి నుంచి నెమ్మదించింది. 7వ రోజు గురువారం (ఆగస్టు 13, 2026) బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 1 కోటి గ్రాస్ కలెక్షన్ మార్క్ ను దాటడానికి తీవ్రంగా శ్రమించింది.

25
తొలి వారం బాక్సాఫీస్ ప్రయాణం

ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రారంభంలో ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ఎక్కువగా సానుకూల స్పందన లభించింది. మేర్లపాక గాంధీ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఏ బాధ్యతల్లేకుండా, కోపంతో ఊగిపోయే ఒక వ్యక్తి శరీరం లోకి కొరియన్ అండర్‌వరల్డ్ డాన్ ఆత్మ ప్రవేశిస్తే ఏం జరిగింది. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే వినూత్నమైన కథాంశంతో రూపుదిద్దుకుంది. ఇందులో రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా, కామెడియన్ సత్య , విటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు.

35
6 రోజుల కలెక్షన్ల వివరాలు

శాక్నిల్క్ (Sacnilk) డేటా ప్రకారం, ఈ తెలుగు ఎంటర్‌టైనర్ మొదటి రోజు రూ. 4.20 కోట్ల నికర (Net) వసూళ్లతో బోణీ కొట్టింది. శని, ఆదివారాల్లో టాక్ బాగుండటంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి. అయితే, వారపు రోజులు మొదలవ్వడంతో వసూళ్ల వేగం తగ్గింది. బుధవారం (6వ రోజు) ఈ సినిమా కలెక్షన్లలో 19.4 శాతం మేర తగ్గుదల నమోదైంది. 6వ రోజున 1,736 షోల ద్వారా ‘కొరియన్ కనకరాజు’ చిత్రం అంచనా ప్రకారం రూ. 1.29 కోట్ల నికర (Net) వసూళ్లను సాధించింది. దీంతో భారత్‌లో 6 రోజుల మొత్తం నికర వసూళ్లు (India Net) రూ. 18.19 కోట్లకు చేరుకోగా, ఇండియా గ్రాస్ కలెక్షన్లు రూ. 20.90 కోట్లుగా నమోదయ్యాయి.

45
7వ రోజు ఎంత వసూలు చేసిందంటే?

ఆగస్టు 13 గురువారం నాటికి కూడా ఈ సినిమా వసూళ్ల వేగం నెమ్మదిగానే సాగుతోంది. శాక్నిల్క్ నివేదికల ప్రకారం, గురువారం 1,666 షోల నుంచి ఈ చిత్రం సుమారు రూ. 83 లక్షల నెట్ కలెక్షన్స్ ను సాధించింది. 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. ఈ తొలినాటి వివరాలతో కలిపితే, ‘కొరియన్ కనకరాజు’ చిత్రం భారతదేశంలో ఇప్పటివరకు సుమారు రూ. 19.02 కోట్ల కలెక్షన్లను సాధించగా.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 26.86 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.

55
బడ్జెట్ అండ్ రికవరీ, 7వ రోజు ఆక్యుపెన్సీ వివరాలు

‘కొరియన్ కనకరాజు’ చిత్రాన్ని సుమారు రూ. 38 కోట్ల అంచనా బడ్జెట్‌తో నిర్మించారు. ఈ లెక్కన సినిమా మొదటి వారంలోనే తన నిర్మాణ వ్యయంలో 50 శాతానికి పైగా వసూళ్లను రాబట్టగలిగింది.

తెలుగు రాష్ట్రాల్లో గురువారం రోజున ఆక్యుపెన్సీ శాతాలు ఈ విధంగా నమోదయ్యాయి

Morning 13.50%

Afternoon 19.08%

Evening 15.17%

Night 19.17%

Overall 17.44%

మొత్తానికి మొదటి వారాన్ని ముగిస్తున్న ‘కొరియన్ కనకరాజు’, రాబోయే రెండో వారంలో ఏ మేర వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories