Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్

Published : Aug 14, 2026, 07:39 AM IST

Agnipariksha: బిగ్ బాస్ లోకి ఉప్పల్ బాలు వస్తున్నాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ సడెన్ గా బిగ్ బాస్ కు శాపాలు పెట్టడం మొదలు పెట్టాడు బాలు. నా ఉసురు తగులుతుందంటూ.. ఫైర్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది?

PREV
14
అగ్నిపరీక్షలో పాల్గొన్న ఉప్పల్ బాలు..

బిగ్ బాస్ లోకి రావాలనేది తనకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అని ఉప్పల్ బాలు పలు సందర్భాల్లో వెల్లడిస్తూ వచ్చాడు. బాలు హౌస్ లోకి వస్తే రచ్చ రచ్చ జరగడం పక్కా అని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతూ వచ్చారు. సోషల్ మీడియా సెలబ్రిటీగా ఉన్న బాలుని బిగ్ బాస్ టీమ్ పిలవకపోగా.. తానే స్వయంగా కామనర్స్ కోటా నుంచి రావాలని అగ్ని పరీక్ష ఈవెంట్ కు వెళ్లాడు. ఇక ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఎలాగైనా కనిపించాలని ఆరాటపడ్టాడు. అగ్ని పరీక్ష ఈవెంట్ లో తాను ఉన్నట్టు వీడియోలు కూడా రిలీజ్ చేశాడు. దాంతో బాలు బిగ్ బాస్ ఎంట్రీ ఈసారి పక్కా అనుకున్నారంత. కానీ సడెన్ గా బిగ్ బాస్ పై, అగ్నిపరీక్ష జడ్జ్ నవదీప్ పై ఫైర్ అవుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు బాలు.

24
బిగ్ బాస్ పై సంచలన రీల్ చేసిన బాలు..

సోషల్ మీడియా సెన్సేషన్, టిక్‌టాక్ , ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా స్టార్ గా మారిన ఉప్పల్ బాలు.. రీసెంట్ గా చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియో తీవ్ర కలకలం రేపింది. బిగ్ బాస్ సీజన్ 10 'అగ్నిపరీక్ష' (కామనర్ ఆడిషన్స్) స్టేజ్ పై తనకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆయన ఈ వీడియోను విడుదల చేశారు. ఉప్పల్ బాలు ఈ వీడియో ద్వారా నిర్వాహకులపై, ముఖ్యంగా ఆడిషన్స్ లో జడ్జీగా వ్యవహరించిన నటుడు నవదీప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆడిషన్స్ కోసం తనను ప్రత్యేకంగా ఆహ్వానించి, ఆపై అవమానకరంగా తిరస్కరించడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

34
ఉప్పల్ బాలు మాట్లాడుతూ..

"నన్ను అగ్నిపరీక్షకు పిలిచి తీవ్రంగా అవమానించారు. మీరు వల్గర్ వీడియోలు (అసభ్యకరమైన కంటెంట్) చేస్తారని నాపై నెగెటివ్‌గా కామెంట్లు చేశారు, విమర్శించారు. నేనేమీ తప్పు పనులు చేయడం లేదు, కేవలం కాలక్షేపం కోసం రీల్స్ చేసుకుంటున్నాను. నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకు గుర్తింపు రావడమే కష్టంగా మారిన పరిస్థితులలో ఈ విధంగా నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సరికాదు" అని ఆవేదనతో మాట్లాడారు. అంతేకాకుండా, జడ్జిగా వ్యవహరించిన నవదీప్‌ను నేరుగా ప్రశ్నిస్తూ— "మీరు చేసిన వీడియోలు ఎవరికి ఉపయోగపడ్డాయి? మీరు ఎవరికైనా ఉచితంగా సాయం చేశారా లేదా దానం చేశారా? మీకు అక్కడ జడ్జిగా కూర్చునే అవకాశం వచ్చింది కాబట్టి మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు" అని ఉప్పల్ బాలు నిలదీశారు.

44
ఈ పాపం మిమ్మల్ని వదిలిపెట్టదు.

.ఉప్పల్ బాలు మాట్లాడుతూ.. ''నా కష్టాన్ని, ప్రతిభను తక్కువ చేసి చూపిస్తూ ఉద్దేశపూర్వకంగానే ఎలిమినేట్ చేశారు. అగ్నిపరీక్ష పేరుతో నన్ను ఇబ్బంది పెట్టి రిజెక్ట్ చేశారు, నా మనసు గాయపడింది. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలిపెట్టదు, ఖచ్చితంగా తగులుతుంది. నాకు న్యాయం జరగాలి" అని ఆవేదన వ్యాక్తం చేశాడు బాలు. . ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో బిగ్ బాస్ ప్రేక్షకులు, నెటిజన్లలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఉప్పల్ బాలు ఆవేదనపై కొందరు సానుభూతి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఆడిషన్ ప్రక్రియలో ఇలాంటి కామెంట్స్ సాధారణమేనని అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories