కొరటాల శివ దర్శకత్వంలో వెంకటేష్, రాఘవేంద్రరావు వల్ల కాలేదు.. డ్రీమ్ ప్రాజెక్ట్ కల నెరవేరబోతోందా ?

Published : Apr 28, 2022, 12:50 PM IST

కథలో వైవిధ్యం కోరుకునే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. అందుకే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేనప్పటికీ దృశ్యం లాంటి అద్భుతమైన చిత్రంలో వెంకీ నటించారు. రీమేక్ అయినప్పటికీ కథకు వెంకటేష్ ఇచ్చే ప్రాధాన్యత అలాంటిది.

PREV
16
కొరటాల శివ దర్శకత్వంలో వెంకటేష్, రాఘవేంద్రరావు వల్ల కాలేదు.. డ్రీమ్ ప్రాజెక్ట్ కల నెరవేరబోతోందా ?
Venkatesh

కథలో వైవిధ్యం కోరుకునే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. అందుకే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేనప్పటికీ దృశ్యం లాంటి అద్భుతమైన చిత్రంలో వెంకీ నటించారు. రీమేక్ అయినప్పటికీ కథకు వెంకటేష్ ఇచ్చే ప్రాధాన్యత అలాంటిది. రాంబాబుగా వెంకటేష్ అదరగొట్టారు. భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన చిత్రాల్లో నటించాలని వెంకీ భావిస్తున్నారు. 

 

26
Venkatesh

ప్రస్తుతం ఆచార్య ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కొరటాల శివ తాజాగా చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారి తీశాయి. కొరటాల శివ ప్రతి చిత్రంలో ఏదో ఒక సందేశం ఉంటుంది. సమాజం గురించి ఆలోచించే భావజాలం కొరటాల శివలో ఉంది. తాజాగా ఇంటర్వ్యూలో కొరటాల శివ స్వామి వివేకానందపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

36
Venkatesh

తనపై స్వామి వివేకానంద ప్రభావం ఎంతైనా ఉందని కొరటాల అన్నారు. స్వామి వివేకానంద బయోపిక్ తెరకెక్కించాలనేది తన కోరిక అన్నారు. అంతటి అనుభవం వచ్చిన రోజున తప్పకుండా మరింత పరిశోధన చేసి తెరకెక్కిస్తానని కొరటాల అన్నారు. కొరటాల ఈ మాట చెప్పగానే విక్టరీ వెంకటేష్ గురించి చర్చ మొదలైంది. 

 

46
Swami Vivekananda

వెంకీ డ్రీమ్ ప్రాజెక్టు కూడా స్వామి వివేకానంద బయోపిక్ కావడం విశేషం. దాదాపు గత పదేళ్లుగా వెంకటేష్ వివేకా ఆనంద బయోపిక్ లో నటించాలని ప్రయత్నిస్తున్నారు. పలు వేదికలపై వెంకటేష్.. తనకు వివేకానంద బోధనలు, ప్రసంగాలు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. బాడీ గార్డ్ చిత్రం తర్వాత వెంకటేష్ స్వామి వివేకానంద బయోపిక్ లో నటించాలని ప్రయత్నించారు. 

 

56
swami vivekananda

నీలకంఠ, రాఘవేంద్ర రావు ఇలా చాలా మంది దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఆ చిత్రం పట్టాలెక్కలేదు. ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. వివేకానంద పాత్రకి వెంకటేష్ బాగా సెట్ అవుతాడు. ఆ చిత్రం గురించి మా మధ్య చర్చ కూడా జరిగింది. కానీ ఎందుకనో అది కుదర్లేదు అని రాఘవేంద్ర రావు అన్నారు. 

 

66
Koratala Siva

ఇప్పుడు కొరటాల శివ ఆ ప్రాజెక్టు టేకప్ చేసేందుకు రెడీగా ఉన్నారు. దీనితో కొరటాల శివ వివేకానంద బయోపిక్ ని వెంకటేష్ తోనే చేస్తారా లేక మరో హీరోని ఎంచుకుంటారా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. అవకాశం దొరికితే మాత్రం వివేకానంద గెటప్ లోకి మారిపోయేందుకు వెంకీ రెడీగా ఉన్నారు. 

 

click me!

Recommended Stories