Shivathmika: వామ్మో శివాత్మిక డేరింగ్ స్టెప్... మేకప్ లేకుండా డీగ్లామర్ లుక్ షేర్ చేసిన యంగ్ బ్యూటీ!

Published : Apr 28, 2022, 12:44 PM IST

సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. ఆకర్షించే అందం ఉన్న వారికే కెరీర్ ఉంటుంది. హీరోయిన్ గా ఎదగాలంటే కట్టిపడేసే అందం ఉండాలి అనేది గట్టి నియమం. అలాంటిది శివాత్మిక మాత్రం డీగ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ షాక్ ఇస్తుంది.

PREV
18
Shivathmika: వామ్మో శివాత్మిక డేరింగ్ స్టెప్... మేకప్ లేకుండా డీగ్లామర్ లుక్ షేర్ చేసిన యంగ్ బ్యూటీ!
Shivathmika Rajashekar

పబ్లిక్ లోకి రావాలంటే హీరోయిన్స్ బెత్తెడు మందాన మేకప్ తో పాటు, ఖరీదైన ట్రెండీ వేర్, యాక్ససరీస్ ధరిస్తారు. అందం అనే కోణంలో తమకున్న లోపాలు ఎక్కడా కనిపించకుండా మేకప్ ద్వారా జాగ్రత్త పడతారు. ఐశ్వర్య రాయ్ దగ్గర నుండి అప్ కమింగ్ హీరోయిన్ వరకు చేసే ప్రక్రియే ఇది.

28
Shivathmika Rajashekar


మేకప్ లేకుండా కెమెరా కంటికి అరుదుగా దొరుకుతారు హీరోయిన్స్. కాగా యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar)ఈ మధ్య తన అసలు సిసలైన పచ్చి అందాలు చూపించేస్తుంది. మేకప్ లేకుండా కనిపించి షాక్ ఇస్తుంది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తరచుగా మేకప్ లెస్ ఫోటో షేర్ చేస్తుంది ఆమె.
 

38
Shivathmika Rajashekar

ముఖంపై పింపుల్స్, బ్లాక్ స్పాట్స్ కనిపిస్తూ రా అండ్ రియల్ గా కనిపించారు. ఇప్పుడిప్పుడే పరిశ్రమలో ఎదుగుతున్న శివాత్మిక ఇలాంటి సాహసాలు ఎందుకు చేస్తున్నారో ఆమెకే తెలియాలి. శివాత్మిక మేకప్ లెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శివాత్మిక మేకప్ లెస్ అందాలపై నెటిజెన్స్ నచ్చిన కామెంట్ చేస్తున్నారు. 

48
Shivathmika Rajashekar

ఇక శివాత్మిక కెరీర్ విషయానికి వస్తే, మొదటి చిత్రంతోనే తన నటనతో వెండితెరపై తన మార్క్ క్రియేట్ చేసింది ఈ చిన్నది. 2019లో విడుదలైన దొరసాని మూవీతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయ్యారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

58
Shivathmika Rajashekar

కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకున్నా శివాత్మిక ప్రతిభ కనబరిచారు. దొర కూతురు పాత్రలో శివాత్మిక అలరించారు. మొదటి చిత్రమే అయినా, చక్కని నటనతో శివాత్మిక ఆకట్టుకున్నారు. అయితే శివాత్మికకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కడం లేదు. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా, కెరీర్ మెల్లగా సాగుతుంది. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ దక్కవని చెప్పడానికి శివాత్మిక మరొక ఉదాహరణ.

68


ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ (Rangamarthanda)మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ మూవీలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అనసూయ సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీపై స్పష్టత లేదు. 
 

78
Shivathmika Rajashekar

అలాగే బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పంచతంత్రం (Panchatantram)మూవీలో సైతం శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. స్వాతి రెడ్డి, సముద్ర ఖని వంటి నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. 

88


రంగమార్తాండ, పంచతంత్రం చిత్రాలతో ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా శివాత్మిక కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి. అలాగే శివాత్మికకు తమిళంలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. బర్త్ డే నాడు నిథమ్ ఒరు వానమ్ అనే బైలింగ్వల్ మూవీ ప్రకటించారు. 

click me!

Recommended Stories