రాజమౌళిలా చేయలేను, ఆ విషయంలో నేను వీక్, కొరటాల శివ ఆసక్తికర వ్యాఖ్యలు, చిరంజీవితో విభేధాలపై ఏమన్నాడంటే?

First Published | Sep 24, 2024, 8:44 PM IST

దర్శకుడు కొరటాల శివ రూపొందించిన `దేవర` చిత్ర ప్రమోషన్స్ లో రాజమౌళి గురించి, చిరంజీవితో విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 

ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్‌ డైరెక్టర్స్ లో సామాజిక స్పృహ కలిగిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొరటాల శివనే. ఆయన ప్రారంభం నుంచి తన సినిమాల్లో ఏదో ఒక బలమైన సందేశాన్ని చెబుతుంటారు. `శ్రీమంతుడు`, `భరత్‌ అనే నేను`, `జనతా గ్యారేజ్‌` చిత్రాలే అందుకు ఉదాహరణ. కమర్షియల్‌ అంశాలను జోడిస్తూనే, తన చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడం, దాన్ని అందరికి కనెక్ట్ అయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. సాధారణంగా సందేశం, కమర్షియాలిటీని సింక్‌ చేయడం అంత ఈజీ కాదు, కానీ కొరటాలకే అది సాధ్యమని చెప్పొచ్చు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

ఆయన గత చిత్రం `ఆచార్య` డిజప్పాయింట్‌ చేసింది, కానీ ఇప్పుడు భారీ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఎన్టీఆర్‌తో `దేవర` సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. మాస్‌ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కించారు. కోస్టల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో, గుర్తింపుకి నోచుకోని ఓ కోస్టల్‌ విలేజ్‌లో మనుషులు ఎలా ఉంటారు, భయమే తెలియని వాళ్లకి దేవర ఎలా భయం చూపించాడు.

అక్కడ జరిగిన గొడవలు, కుట్రలు, ఎమోషన్స్ ఏంటనేది `దేవర` సినిమాలో చూపించబోతున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ మూవీ ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు కొరటాల శివ మంగళవారం ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌, ప్రమోషన్స్ తక్కువగా ఉండటం, చిరంజీవితో గొడవ వంటి విషయాలపై మాట్లాడారు. 
 


రాజమౌళి తన సినిమాలకు ప్రమోషన్స్ చేసినట్టుగా `దేవర` విషయంలో చేయకపోవడానికి కారణమేంటనే దానిపై కొరటాల స్పందిస్తూ, రాజమౌళిలా తనకు సినిమా ప్రమోషన్‌ చేయడం రాదు అని తెలిపారు. ఈ విషయంలో తాను వీక్‌ అని చెప్పేశారు. ఇప్పటికే మెయిన్‌ సిటీస్‌లో ఈవెంట్లు పెట్టాం. మన వద్ద ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేశాం, కానీ అది అనుకోకుండా రద్దు అయ్యింది. ఎప్పుడైనా చేసేది ఇదే అని తెలిపారు. ఏదైనా కంటెంట్‌ మాట్లాడాలని తాను కోరుకుంటానని, కంటెంట్‌పై ఫోకస్‌ ఉంటుందని తెలిపారు. 

chiranjeevi

ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవితో వివాదంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. `ఆచార్య` ఫలితం అనంతరం చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దర్శకుడు కొరటాల శివనే అనే ప్రచారం జరిగింది. దర్శకులను ఉద్దేశించి ఆయన కామెంట్‌ చేయడంతో అది కొరటాలకే అన్వయించారు. ఇద్దరి మధ్య విభేదాలున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా దీనిపై కొరటాల వివరణ ఇచ్చారు. 
 

`ఆచార్య` ఫ్లాప్‌ అయిన తర్వాత చిరంజీవినే స్వయంగా తనకు మెసేజ్‌ చేశాడని, మళ్లీ బౌన్స్ బ్యాక్‌ కావాలని, ఈ సారి మామూలుగా కొట్టవు. ఇండస్ట్రీలో హిట్‌, ఫ్లాప్‌లు కామన్‌ అని ధైర్యం చెప్పాడని తెలిపారు. ఈ విషయాలు తెలియక కొందరు అనవసరం ఏవో కల్పించి తప్పుగా చిత్రీకరిస్తున్నారని వెల్లడించారు. చిరంజీవితో సంబంధాలు బాగానే ఉన్నాయని తెలిపారు కొరటాల.  

అలాగే ఎన్టీఆర్‌కి ముందు అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనుకున్నారు కొరటాల. ఆ సినిమాని కూడా ప్రకటించారు. కానీ అనుకోని కారణాలో అది కాన్సిల్‌ అయ్యింది. అనంతరం ఎన్టీఆర్‌ తో `దేవర` ట్రాక్‌లోకి వచ్చింది. అయితే ఆ కథ, ఇది కాదని, ఇది తారక్‌ కోసమే రెడీ చేసిన స్క్రిప్ట్ అని చెప్పారు కొరటాల. 
 

ఇక `దేవర` చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దీనిపై స్పందిస్తూ దేవర బలమైన పాత్ర అని, దాన్ని మించిన పాత్ర వర అని, ఈ పాత్రలకు వేరే ఎవరిని పెట్టినా న్యాయం జరగదని, అందుకే ఎన్టీఆర్‌నే పెట్టినట్టు తెలిపారు. సినిమాని రెండు భాగాలు చేయడంపై స్పందిస్తూ, కథ చెప్పినప్పుడే పేపర్‌ మీదనే నాలుగు గంటలు వచ్చిందని, దాన్ని సినిమాగా తీస్తే ఆరేడు గంటలు వస్తుందని, అప్పుడే అందరు ఇది ఒక్క సినిమాగా చేయడం కష్టమేమో అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

కానీ రెండో షెడ్యూల్‌ కి వెళ్లేసరికి మాకు ఓ క్లారిటీ వచ్చింది. దీన్ని ఒక్క సినిమాగా చెప్పడం కష్టమని రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు కొరటాల. అదిరిపోయే సస్పెన్స్ తో మొదటి భాగం ముగుస్తుందని, రెండో పార్ట్ ఎప్పుడెప్పుడు చూడాలనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుందన్నారు దర్శకుడు. తారక్‌ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్‌ అలీ ఖాన్‌నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. సెప్టెంబర్‌ 27న ఈ సినిమా విడుదల కాబోతుంది. 

Latest Videos

click me!