Kodali Nani: పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. వైసీపీ నేత కొడాలి నాని సోషల్ మీడియా వేదిక గా పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది.. దీనిపై ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ కి.. మాజీ తెలుగు దేశం పార్టీ నాయకుడు కొడాలి నాని గతంలో చాలా మంచి స్నేహితులు. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు నుంచే వీరి మధ్య స్నేహం మొదలైంది. ఒకానొక సమయంలో కొడాలి నాని కోసం ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం కూడా చేశారు. అయితే.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నాయకుడు ఏ పార్టీలో మారతాడో కూడా ఎవరూ ఊహించలేరు. అదేవిధంగా కొడాలి నాని టీడీపీ ని వీడి.. వైసీపీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వచ్చాయి.
22
వైరల్ గా కొడాలి నాని పోస్ట్...
కాగా.. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ మీద కొడాలి నాని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టడం విశేషం. గతంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటో ఒకటి షేర్ చేసి.. ‘ అడ్వాన్స్ .. హ్యాపీ బర్త్ డే నాన్న’ అంటూ షేర్ చేశారు. ఆ ఫోటోకి ఎన్టీఆర్ కి సంబంధించిన పాటనే పెట్టడం విశేషం. కాగా.. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పోస్టు చూసి వీరిద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తారక్ ని ‘ నాన్న’ అని సంభోధించడం అందరికీ విపరీతంగా నచ్చేస్తోంది. వారి మధ్య ఉన్న బంధాన్ని ఆ పదం తెలియజేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో.. ‘ మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి.. మీ ఇద్దరి మధ్య బంధం బాగుండాలి.. కొడాలి నాని ఎప్పుడూ ఎన్టీఆర్ కి తోడుగా ఉండాలి’ అంటూ కామెంట్స్ చేయడం విశేషం. మరి కొందరు టీడీపీ వారసుడు అంటూ ఎన్టీఆర్ ని ప్రస్తావిస్తూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా వీరి బంధం చాలా బాగుందని మరికొందరు మెచ్చుకుంటున్నారు.
ఓవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ ప్రభుత్వానికీ.. మరోవైపు కొడాలి నానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా శత్రుత్వం ఉంది. ఇలాంటి సమయంలో.. కొడాలి నాని పనిగట్టుకొని మరీ.. అడ్వాన్స్ గా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ తెలియజేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై టీడీపీ, వైసీపీ వాళ్లు ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి.