చిరంజీవి మూడు చిత్రాలకు రిక్వస్ట్ చేసినా ఒప్పుకోని హీరోయిన్.. సీనియర్ నటి ఎందుకలా చేసిందో తెలుసా ?

First Published | Aug 19, 2024, 12:03 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించారు. రాధా, రాధికా, విజయశాంతి, రమ్యకృష్ణ, రంభ లాంటి హీరోయిన్లు చిరంజీవితో నటించారు. 

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించారు. రాధా, రాధికా, విజయశాంతి, రమ్యకృష్ణ, రంభ లాంటి హీరోయిన్లు చిరంజీవితో నటించారు. అయితే కొందరు హీరోయిన్లతో చిరంజీవి కాంబినేషన్ కుదర్లేదు. అలాంటి హీరోయిన్లలో సీనియర్ నటి గౌతమి కూడా ఒకరు. 

అప్పట్లో గౌతమి కూడా సౌత్ లో ప్రముఖ హీరోయిన్ గా రాణించారు. తెలుగులో కూడా గౌతమి చాలా చిత్రాల్లో నటించారు. గౌతమి నటనా ప్రతిభ గురించి ఎవరికీ సందేహం లేదు.నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో గౌతమి నటించారు. అయితే చిరంజీవితో కలసి నటించలేకపోయానని గౌతమి ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు. 


ఓ ఇంటర్వ్యూలో గౌతమి చిరంజీవితో నటించకపోవడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారితో నేను నటించలేదు. ఆయన చాలా బాధపడ్డారు. నాకు కూడా తలుచుకుంటే బాధగానే ఉంటుంది. నా వల్ల చిరంజీవి గారు 3 సార్లు అప్ సెట్ అయ్యారు. 

Actress Gautami

ఎందుకంటే చిరంజీవి గారితో నటించే ఛాన్స్ మూడు చిత్రాల్లో వచ్చింది. ప్రతిసారి వేరే చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ కుదర్లేదు. చాలా రిక్వస్ట్ చేశారు. ఎంత ప్రయత్నించినా డేట్లు అడ్జెస్ట్ కాలేదు. దీనితో చిరంజీవి గారితో నటించడం సాధ్యపడలేదు అని గౌతమి అన్నారు. 

gautami

ఆ సమయంలో నేను రజనీకాంత్ సినిమాకి ఆల్రెడీ కమిటై ఉన్నాను. నేను ఒకసారి సైన్ చేస్తే ఎలాంటి సమస్య అయినా ఎదురుకానీ.. ఆ చిత్రం పూర్తి చేసి తీరుతాను. రజనీకాంత్ సినిమాతో పాటు మరి కొన్ని చిత్రాలకు సైన్ చేయడం వల్ల చిరంజీవితో ఆఫర్స్ మిస్ అయ్యాయి. 

ఎప్పుడైనా చిరంజీవి  కలసినప్పుడు ఆయనకి వివరణ ఇస్తా అంటూ గౌతమి అన్నారు. గతంలో గౌతమి కమల్ హాసన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. కానీ ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. 

Latest Videos

click me!